అంతర్జాతీయ క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 4 సంవత్సరాల 29 రోజుల తర్వాత ఐపీఎల్ సెంచరీని సాధించడం ద్వారా 8 నెలల్లో క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్, టోర్నమెంట్‌లో తన పునరాగమనాన్ని పూర్తి చేశాడు. 2019లో 70వ అంతర్జాతీయ సెంచరీ తర్వాత, సెప్టెంబర్ 2022 వరకు విరాట్ బ్యాట్ నుంచి సెంచరీ రాలేదు.
విరాట్ హాఫ్ సెంచరీలను దాటగలిగాడు. కానీ, సెంచరీ చేయలేకపోయాడు. 2022 సెప్టెంబర్ 8న టీ20 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై కోహ్లి 122 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ని ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద పునరాగమనం కథ ఇక్కడి నుంచే మొదలైంది.
అప్పటి నుంచి టీ20, వన్డేలు, టెస్టుల్లో సెంచరీలతో ఐపీఎల్‌లో సెంచరీ కరవుకు తెరదించాడు. తాజాగా కోహ్లీ SRHకి వ్యతిరేకంగా తన సెంచరీలో 4 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. దానిపై అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై కూడా దృష్టి సారించినట్లు మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. అందుకే టైమింగ్‌తో ఫోర్లు కొట్టడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..