IPL 2023లో 2 మ్యాచ్‌లుజరిగాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. అదే సమయంలో రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ముందు పంజాబ్ కింగ్స్ సమరానికి సిద్ధమైంది. ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ జట్టులో భాగం కాలేదు. ఇక ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కేఎల్ రాహుల్ 74 పరుగులు 56 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. కైల్ మేయర్స్ 29 పరుగులు 23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు ఆకట్టుకున్నాడు. కృనాల్ పాండ్య 18పరుగులు ,స్టాయినిస్ 15 పరుగులు చేశారు. ఇక పంజాబ్ బ్యాటింగ్ లో సికిందర్ రజా 57 పరుగులు 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు అర్ధ శతకంతో రాణించాడు. చివర్లో షారూక్ ఖాన్ 23పరుగులు 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మాథ్యూ షార్ట్ 34 పరుగులు 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు . హర్‌ప్రీత్ సింగ్ భాటియా 22 పరుగులు చేశాడు.