IPL 2023: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 4గురు స్టార్ ప్లేయర్స్.. జోష్‌లో ఫ్రాంచైజీలు..

|

Mar 14, 2023 | 9:43 AM

New Zealand Cricket Team: న్యూజిలాండ్ క్రికెట్ (NZ) శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో సహా 4 స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. దీంతో వారు IPLలో పాల్గొనే ఛాన్స్ ఉంది.

IPL 2023: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 4గురు స్టార్ ప్లేయర్స్.. జోష్‌లో ఫ్రాంచైజీలు..
Ipl 2023
Follow us on

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ (IPL 2023) మార్చి 31, 2023న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. అయితే, ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో మాత్రం ఆందోళన ఏ మాత్రం తగ్గడంలేదు. క్యాష్ రిచ్ లీగ్‌లో తమ జట్లలో అంతర్భాగంగా ఉన్న చాలా మంది ఆటగాళ్లు కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంలేదు. అయితే, ఈ టెన్షన్ నుంచి కొన్ని టీంలకు గుడ్ న్యూస్ అందింది. న్యూజిలాండ్ క్రికెట్(NZ) కెప్టెన్‌తో సహా 4గురు స్టార్ ప్లేయర్లను శ్రీలంక సిరీస్ నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో కేన్ విలియమ్సన్ లంకతో వన్డే సిరీస్‌లో కనిపించడు. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు వీలుంది. టిమ్ సౌతీ, డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్ ఐపీఎల్‌లో ఆడేందుకు వీలుగా మరో ముగ్గురు ఆటగాళ్లను కూడా బోర్డు విడుదల చేసింది.

కేన్ విలియమ్సన్‌ను ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. వేలంలో గత ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ బేస్ ధర రూ. 2 కోట్లతో కేన్ మామను దక్కించుకుంది. మరోవైపు, IPL 2022లో 7 మ్యాచ్‌ల్లో 252 పరుగులు చేసిన డెవాన్ కాన్వే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. దీంతో లీగ్‌లో అత్యుత్తమ ఓపెనర్‌లలో ఒకడిగా బరిలోకి దిగనున్నాడు. మిచెల్ సాంట్నర్ కూడా CSK తరపున ఆడనున్నాడు. టిమ్ సౌథీ IPL 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు.

మరోవైపు, లాకీ ఫెర్గూసన్, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ లంకతో తొలి వన్డేని మార్చి 25న ఆడనున్నారు. ఇక లాకీ ఫెర్గూసన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడనుండగా, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో భాగంగా బరిలోకి దిగనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..