T20 Records: టీ20లో 175 పరుగుల వరల్డ్ రికార్డును బద్దలుకొట్టే దమ్ము ఆ ఆటగాడికే.. దిగ్గజ క్రికెటర్ అంచనా ఇది..

Chris Gayle: యూనివర్సల్ బాస్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. లీగ్ మ్యాచ్‌ల్లో తన సత్తా చూపిస్తూనే ఉన్నాడు. వన్డేలు, టెస్టులలో ఆకట్టుకోలేకపోయినా.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం లెక్కలు మించి రికార్డులు నెలకొల్పాడు.

T20 Records: టీ20లో 175 పరుగుల వరల్డ్ రికార్డును బద్దలుకొట్టే దమ్ము ఆ ఆటగాడికే.. దిగ్గజ క్రికెటర్ అంచనా ఇది..
Chris Gayle Viral Video

Updated on: Mar 18, 2023 | 1:44 PM

T20 Records: యూనివర్సల్ బాస్‌గా పేరుగాంచిన వెస్టిండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. లీగ్ మ్యాచ్‌ల్లో తన సత్తా చూపిస్తూనే ఉన్నాడు. వన్డేలు, టెస్టులలో ఆకట్టుకోలేకపోయినా.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం లెక్కలు మించి రికార్డులు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్‌లో 462 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలతో 14,562 పరుగులు చేసి సత్తా చాటాడు. అయితే, గేల్ ఐపీఎల్ 2013 ఎడిషన్‌లో పూణే వారియర్స్ తరపున ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విధ్వంసం చేశాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 175* (66) ప్రపంచ రికార్డును క్రియోట్ చేశాడు.

ఆయన తర్వాత ఆరోన్ ఫించ్ (172), హామిల్టన్ మసకద్జా (162*), బ్రెండన్ మెకల్లమ్ (158*), ఇటీవల డెవాల్డ్ బ్రెవిస్ (162) లాంటి ఆటగాళ్లు నిలిచాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ హిట్టర్లలో ఎవరూ ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. చాలా మంది దగ్గరగా వచ్చినా.. ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయారు.

ఈ క్రమంలో గేల్ తన రికార్డును బ్రేక్ చేయగల స్టార్ బ్యాటర్‌ ఎవరో చెప్పేశాడు. అయితే, గేల్ చెప్పిన పేరు వింటే మాత్రం షాక్ అవుతారనడంలో ఎలాంటి సదేహం లేదు. ఎందుకంటే అంతా తుఫాన్ బ్యాటింగ్ పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ లేదా జోస్ బట్లర్ అనుకుంటారు.. కానీ, ఆయన మాత్రం టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్ మాత్రమే ఈ భారీ రికార్డ్‌ను బ్రేక్ చేస్తాడని ఆశ్చర్యపరిచాడు. అయితే, దీనికి గల కారణాలు కూడా చెప్పుకొచ్చాడు. కేవలం రాహుల్‌కు మాత్రమే ఈ సామర్థ్యం ఉందని, అతను ఐపీఎల్ 2023లో భారీ ఇన్నింగ్స్‌తో ఈ ఫీట్‌ను సాధిస్తాడని, బరిలోకి దిగినప్పుడు చాలా ప్రమాదకరమని టీ20 లెజెండ్ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

‘ముఖ్యంగా డెత్ ఓవర్లలో అంటే 15వ ఓవర్ నుంచి 20వ ఓవర్ మధ్యలో కేఎల్ రాహుల్ చాలా ప్రమాదకరంగా ఉంటాడు. మంచి ప్రారంభాన్ని పొందితే, భారీ శతకం సాధించి, ఖచ్చితంగా 175 దాటగలడు” అంటూ గేల్ పేర్కొన్నాడు. రికార్డులను బద్దలు కొట్టడమనేది జరుగుతూనే ఉంటుందని, అయితే, అది ఎప్పుడు జరుగుతుందనే మాత్రం ఎవరికీ తెలియదని గేల్ అన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..