IPL Stats: ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త చరిత్ర.. ఏకంగా మూడుసార్లు.. లిస్టులో టాప్ టీం ఏదంటే?

IPL 2023: ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన RCB ఫాఫ్ డుప్లెసిస్ (65), గ్లెన్ మాక్స్‌వెల్ (68) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

IPL Stats: ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త చరిత్ర.. ఏకంగా మూడుసార్లు.. లిస్టులో టాప్ టీం ఏదంటే?
Mi Vs Rcb

Updated on: May 10, 2023 | 8:25 PM

IPL 2023: 200 పరుగుల ఛేజింట్ అంటే కష్టమే. ఐపీఎల్‌లో భారీ టార్గెట్‌గా పేరుగాంచిన 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం ఈజీగా తీసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు ఫాఫ్ డుప్లెసిస్ (65), గ్లెన్ మాక్స్‌వెల్ (68) రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

అయితే 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం 16.3 ఓవర్లలోనే భారీ విజయాన్ని అందుకుంది. విశేషమేమిటంటే ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 3వ సారి 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగులను ఛేజ్ చేసి విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు.

అంటే ఐపీఎల్ సీజన్‌లో 200+ పరుగులు సాధించిన రికార్డును ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇంతకు ముందు ఈ రికార్డు పంజాబ్ కింగ్స్, సీఎస్‌కే జట్టు పేరిట ఉండేది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ 2014లో రెండుసార్లు 200+ స్కోర్‌లను చేజ్ చేసి గెలిచింది. అలాగే 2018లో CSK జట్టు రెండుసార్లు ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఈ రెండు జట్ల రికార్డును ముంబై ఇండియన్స్ బద్దలు కొట్టింది.

ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్‌పై 215, రాజస్థాన్ రాయల్స్‌పై 213, ఆర్‌సీబీపై 200 పరుగులను ఛేజ్ చేసింది.

దీంతో ఒకే సీజన్‌లో 3 సార్లు 200+ పరుగులను ఛేదించిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..