IPL-2023 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఈ లీగ్ ప్రస్తుత సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్ జట్టు ఇప్పటికే తెలింది. చెన్నై సూపర్ కింగ్స్ తన బెర్త్‌ను ఫిక్స్ చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నై ఏ జట్టుతో తలపడనుందో మరికొద్ది గంట్లో తేలనుంది. ఈ రోజు క్వాలిఫయర్-2లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ వర్సెస్ గత విజేత గుజరాత్ టైటాన్స్ తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌కి లేదా ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే? ఈ ప్రశ్న అభిమానుల మదిలో కూడా మెదిలింది. ఎందుకంటే ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. ఇలాంటి పరిస్థితికి సంబంధించి బీసీసీఐ కొన్ని నిబంధనలను రూపొందించింది.
అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో సీఎస్‌కేతో ఏ జట్టు ఆడుతుందనే సందిగ్ధం నెలకొంది. అయితే, ఇందుకోసం కొన్ని నియమాలు కూడా నిర్ణయించారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఏ జట్టుకు ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో లీగ్ రౌండ్‌లో మ్యాచ్ రద్దు అయితే, రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు. అయితే ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఐపీఎల్ నిబంధనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా క్వాలిఫయర్లు రద్దైతే.. ఫైనల్ రౌండ్‌లోకి ఏ జట్టు ప్రవేశిస్తుందనే ప్రశ్న చాలా మంది క్రికెట్ ప్రేమికుల మదిలో మెదులుతోంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం క్వాలిఫయర్స్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో సీఎస్‌కేతో ఆడే అవకాశం ఉంటుంది. వర్షం కారణంగా ముంబై ఇండియన్స్‌కు అవకాశం లభించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. నియమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నిబంధన ప్రకారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే లీగ్ టేబుల్‌లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌లో ఆడుతుంది. ఐపీఎల్ లీగ్ రౌండ్‌లో 10 మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్ జట్టు 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై 14 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి 16 పాయింట్లు మాత్రమే సాధించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా క్వాలిఫయర్-2 రద్దైతే గుజరాత్ టైటాన్స్ జట్టు ఆఖరి రౌండ్‌లో ఆడుతుంది.