IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. బెంగళూర్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

|

Apr 02, 2023 | 3:57 PM

Rohit Sharma: రోహిత్ శర్మ గాయపడ్డాడు. అందుకే కెప్టెన్‌ షూట్‌లో పాల్గొనలేదు. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడతాడా? లేదా అనే దానిపై ముంబై కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు.

IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. బెంగళూర్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?
Ipl 2023 Rohit
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఐదవ మ్యాచ్ నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడటంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల షూట్ జరిగినప్పుడు రోహిత్ పాల్గొనలేదు. ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో రోహిత్ ఆడే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. హిట్‌మ్యాన్‌పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ స్పందించాడు.

రోహిత్ ఫిట్‌గా ఉన్నాడన్న కోచ్..

RCBతో రోహిత్ శర్మ ఆడడం లేదనే పుకార్లను ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ తోసిపుచ్చాడు. ముంబైని ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నాడని అంటున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో రోహిత్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్న అడగగా.. ‘అవును రోహిత్‌ ఫిట్‌గా ఉన్నాడు. గత రెండు రోజులుగా శిక్షణ తీసుకున్నాడు. 100 శాతం మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆరోజు ఉదయం అతనికి బాగా లేదు. ముందుజాగ్రత్తగా రోహిత్‌ని ఇంట్లోనే ఉండమని చెప్పాం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..