Mark Boucher: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టైన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్- 2023 సన్నాహకాల్లో భాగంగా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ బార్క్ బౌచర్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘మా కొత్త హెడ్ కోచ్‌ను అందరికీ పరిచయం చేస్తున్నాం. మన ఫ్యామిలీలోకి లెజెండ్‌ను స్వాగతించండి’ అంటూ ముంబై ఇండియన్స్ ట్వీట్ చేసింది. కాగా రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మార్క్ బౌచర్‌ను సాదరంగా ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలోకి ఆహ్వానించాడు. ‘ముంబై ఇండియన్స్‌లోకి బౌచర్‌ను స్వాగతించడానికి ఎంతో సంతోషిస్తున్నా. ఆటగాడిగా, కోచ్‌గా ఎంతో నైపుణ్యం సాధించి తన టీం విజయాల్లో కీలక పాత్ర పోషించిన బౌచర్ రాకతో ముంబై ఇండియన్స్ బలోపేతమైంది. మన జట్టును మరింత ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకముంది’ అని చెప్పుకొచ్చాడు.
ఇక ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ పదవి రావడంపై మార్క్ బౌచర్ కూడా స్పందించాడు. ‘ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా నియమితులవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సవాలుకు నేను సిద్ధంగా ఉన్నా. గొప్ప నాయకత్వం, గొప్ప ఆటగాళ్లతో ముంబై బలంగా ఉంది. ఈ టీమ్‌కు నా సలహాలు అందించడానికి ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చాడీ సౌతాఫ్రికా మాజీ ప్లేయర్. కాగా దక్షిణాఫ్రికా జట్టుకు మొత్తం 15 ఏళ్ల పాటుకు ప్రాతినిథ్యం వహించాడు బౌచర్. సఫారీల జట్టు తరఫున వికెట్ కీపర్‌గా మొత్తం 147 టెస్టులు, 295 వన్డేలు ఆడాడు.
Presenting आपले नवीन Head Coach – ???? ??????? ?
Paltan, drop a ? to welcome the ?? legend to our #OneFamily ?#DilKholKe #MumbaiIndians @markb46 @OfficialCSA pic.twitter.com/S6zarGJmNM
— Mumbai Indians (@mipaltan) September 16, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..