IPL 2023 Mini Auction: ఐపీఎల్ 2023 దగ్గర పడుతుండడంతో అన్ని ఫ్రాంచైజీలు స్వ్కాడ్‌లపై ఫోకస్ చేస్తున్నాయి. దీంతో అన్ని జట్లు నవంబర్ 15 న తమ రిలీజ్, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందజేశాయి. ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా అన్ని జట్లు తమ పర్స్ విలువను పెంచుకున్నాయి. మినీ వేలంలో జట్లు ఈ డబ్బును ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏ జట్టులో ఎంత పర్స్ విలువ మిగిలి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక పర్స్ విలువ రూ.42.25 కోట్లను కలిగి ఉంది. కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి పెద్ద ఆటగాళ్లను జట్టు విడుదల చేసింది. అలాగే, జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ గత సీజన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత మొత్తం పర్స్ విలువ రూ.32.20 కోట్లకు చేరింది. అదే సమయంలో జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
గతేడాది సెమీఫైనల్‌కు చేరిన లక్నో సూపర్ జెయింట్స్.. ఈసారి కొంతమంది ఆటగాళ్లను విడుదల చేసి పర్స్ విలువను రూ. 23.35గా చేసుకుంది. జట్టులో మొత్తం 4 విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో భారీ మార్పులు చేసింది. మినీ వేలానికి జట్టు మొత్తం పర్స్ విలువ రూ. 20.55కోట్లకు చేరింది. అదే సమయంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు మిగిలి ఉన్నాయి.
క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే వంటి ఆటగాళ్లను జట్టు వదిలేసింది. ఇప్పుడు జట్టు మొత్తం పర్స్ విలువ రూ.20.45 కోట్లకు చేరింది. అదే సమయంలో, జట్టుకు మొత్తం ఇద్దరు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు మిగిలి ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ శార్దూల్ ఠాకూర్‌ను రిలీజ్ చేసింది. ఆ తర్వాత రూ. 19.45 కోట్ల పర్స్ విలువ మిగిలి ఉంది. అదే సమయంలో జట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు స్లాట్లు మిగిలి ఉన్నాయి.
ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ లాకీ ఫెర్గూసన్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను విడుదల చేసింది. దీంతో జట్టు వద్ద మొత్తం పర్స్ విలువ రూ.19.25 కోట్లు మిగిలి ఉంది. అదే సమయంలో జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి.
ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ పర్స్ విలువ 13.20 కోట్లకు చేరింది. అదే సమయంలో, జట్టుకు నలుగురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు మిగిలి ఉన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత పర్స్ విలువ రూ.8.75 కోట్లకు చేరింది. ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు కూడా జట్టులో మిగిలి ఉన్నాయి.
KKR ట్రేడ్ ద్వారా లాకీ ఫోర్గూసన్, శార్దూల్ ఠాకూర్, రహ్మానుల్లా గుర్బాజ్‌లను జట్టులో చేర్చుకుంది. ఆ తర్వాత జట్టు వద్ద రూ. 7.05 కోట్ల పర్స్ మిగిలి ఉంది. ఇది అన్ని జట్లలో అతి తక్కువగా నిలిచింది. జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్ల స్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.