IPL Auction 2023: ఏ జట్టులో ఎంతమంది ప్లేయర్లకు ఛాన్స్.. పర్స్‌లో ఇంకెంత డబ్బు .. పూర్తి వివరాలు మీకోసం..

ఐపీఎల్ 2023 కోసం డిసెంబర్ 23న వేలం నిర్వహించనున్నారు. దీనికి ముందు ఏ జట్టులో ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయో.. అన్ని ఫ్రాంచైజీల పర్స్‌లో ఎంత డబ్బు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL Auction 2023: ఏ జట్టులో ఎంతమంది ప్లేయర్లకు ఛాన్స్.. పర్స్‌లో ఇంకెంత డబ్బు .. పూర్తి వివరాలు మీకోసం..
Ipl 2023 Mini Auction

Updated on: Dec 20, 2022 | 12:32 PM

ఐపీఎల్ వేలం కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 కోసం ఆటగాళ్లను డిసెంబర్ 23న కొచ్చిలో వేలం వేయనున్నారు. ఈ వేలానికి ముందు, అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందజేశాయి. అటువంటి పరిస్థితిలో, అన్ని జట్లతో ఇంకా ఎన్ని స్లాట్లు ఖాళీగా ఉన్నాయి, వారి పర్స్‌లో వేలం కోసం ఎంత డబ్బు ఉందో వేలానికి ముందు తెలుసుకుందాం..

సన్‌రైజ్ హైదరాబాద్..

ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక పర్స్ విలువ రూ.42.25 కోట్లుగా మారింది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రస్తుతం 17 మంది ఆటగాళ్లకు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 13 మంది భారత, 4గురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకునే అవకాశం ఉంది.

పంజాబ్ కింగ్స్..

వేలంలో పంజాబ్ కింగ్స్ పర్స్ ప్రస్తుతం రూ.32.20 కోట్లుగా ఉంది. అదే సమయంలో పంజాబ్‌లో ఇంకా 12 మంది ఆటగాళ్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 9 మంది భారతీయ, 3గురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

లక్నో సూపర్ జెయింట్స్..

ఐపీఎల్ వేలం కోసం లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.23.35 కోట్ల పర్స్ ఉంది. ప్రస్తుతం లక్నోలో 14 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 10 మంది భారతీయ, నలుగురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.

ముంబై ఇండియన్స్..

ఐపీఎల్ ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్ ప్రస్తుతం వేలంలో రూ.20.55 కోట్ల పర్స్ కలిగి ఉంది. ముంబైలో ప్రస్తుతం 12 మంది ఆటగాళ్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 9 మంది భారతీయ, 3 విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్..

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐపీఎల్ వేలం కోసం రూ.20.45 కోట్ల పర్స్ కలిగి ఉంది. చెన్నైలో ప్రస్తుతం 9 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 7 మంది భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్..

ఐపీఎల్ మినీ వేలం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ప్రస్తుతం రూ.19.45 కోట్ల పర్స్ ఉంది. అదే సమయంలో, ఢిల్లీలో 7గురు ఆటగాళ్ల స్లాట్స్ ఖాళీగా ఉంది. ఇందులో 5 మంది భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

గుజరాత్ టైటాన్స్..

ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వేలం కోసం రూ. 19.25 కోట్ల పర్స్ కలిగి ఉంది. ప్రస్తుతం గుజరాత్‌లో 10 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 7 మంది భారతీయ, ముగ్గురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.

రాజస్థాన్ రాయల్స్..

ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ పర్స్ విలువ రూ.13.20 కోట్లు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 13 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 9 మంది భారతీయ, 4గురు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

ప్రస్తుతం ఐపీఎల్ వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్స్ విలువ రూ.8.75 కోట్లు. ప్రస్తుతం బెంగళూరులో 9 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 7 మంది భారత, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్..

ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ పర్స్ విలువ రూ.7.05 కోట్లు. కోల్‌కతాలో ప్రస్తుతం 14 మంది ఆటగాళ్ల స్లాట్ ఖాళీగా ఉంది. ఇందులో 11 మంది భారత, 3గురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..