IPL 2023, Lucknow Super Giants vs Mumbai Indians, Eliminator Probable Playing XI: ఐపీఎల్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం, మే 24న జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెన్నై పిచ్ స్లోగా కనిపించింది. ఇక్కడ స్పిన్నర్లకు మంచి సహాయం అందుతుంది. అటువంటి పరిస్థితిలో లక్నో, ముంబై జట్లు రెండూ దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్లేయింగ్ XIని సెట్ చేయాలనుకుంటున్నాయి. ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు కూడా మంచి స్వింగ్ లభిస్తుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ముంబై తన మునుపటి ప్లేయింగ్ ఎలెవన్‌తో మైదానంలోకి రావచ్చని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ తిరిగి జట్టులోకి రావొచ్చు. గత మ్యాచ్‌లో తిలక్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్ జాబితాలో చేరాడు. ఈసారి అతను ఇంపాక్ట్ ప్లేయర్ ద్వారా జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ప్రవేశించవచ్చు.
అదే సమయంలో, లక్నో జట్టులో స్వల్ప మార్పును చూడొచ్చు. KKRతో జరిగిన చివరి మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్, కరణ్ శర్మ జోడీ లక్నో నుంచి ఓపెనింగ్‌లో కనిపించారు. ఈసారి కూడా డి కాక్‌తో ఓపెనింగ్‌ను నిర్వహించే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ ద్వారా ఆయుష్ బదోని ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి చేరడం దాదాపు ఖాయం.
లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: కైల్ మేయర్స్, క్వింటన్ డి కాక్ (కీపర్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కె గౌతమ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ/విష్ణు వినోద్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, హృతిక్ షోకీన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..