IPL 2023: ప్రాక్టీస్‌లో పొట్టు పొట్టుగా కొట్టుకున్న ముంబై, గుజరాత్‌ ఆటగాళ్లు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో

|

Apr 25, 2023 | 6:18 PM

ఐపీఎల్ 2023లో తొలిసారిగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికొన్ని నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్లలోనూ స్టార్‌ ప్లేయర్లు ఉండడంతో ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగవచ్చని క్రికెట్‌ పండితులు భావిస్తున్నారు.

IPL 2023: ప్రాక్టీస్‌లో పొట్టు పొట్టుగా కొట్టుకున్న ముంబై, గుజరాత్‌ ఆటగాళ్లు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో
ujarat Titans vs Mumbai Indians
Follow us on

ఐపీఎల్ 2023లో తొలిసారిగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మరికొన్ని నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్లలోనూ స్టార్‌ ప్లేయర్లు ఉండడంతో ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగవచ్చని క్రికెట్‌ పండితులు భావిస్తున్నారు. కాగా మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది. ముంబై ఓపెనర్‌ ఇషాన్‌ కిషాన్‌, శుభ్‌మన్‌ గిల్‌ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదంతా సరదాగా జరిగిందే వివరాల్లోకి వెళితే.. శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. ఇద్దరూ టీమ్ ఇండియాకు కూడా ఆడుతున్నారు. భారత జట్టులో ఉన్నప్పుడు కూడా ఒకే గదిలో ఉంటారు. అంటే ఇద్దరూ రూమ్ పార్టనర్లు కూడా. ఇప్పడిద్దరూ IPLలో వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. కాగా చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు గిల్‌, కిషాన్‌. పలకరింపుల్లో భాగంగా సరదాగా ఒకరినొకరు తోసుకున్నారు. ప్రాక్టీస్‌ కోసం నరేంద్ర మోడీ స్టేడియంలోకి శుభ్‌మన్ గిల్ అడుగుపెట్టిన వెంటనే ఇషాన్ కిషన్ చెంపదెబ్బ కొట్టాడు. కాసేపటి తర్వాత ఇషాన్‌ కిషన్‌ చెంపపై దెబ్బేశాడు గిల్‌. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఇవి కూడా చదవండి

కాగా గుజరాత్, ముంబై మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్‌ జరగనుంది. హార్ధిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది.మరోవైపు ముంబై జట్టు 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉంది. కాగా గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కొన్నేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. గత సీజన్‌లో ముంబై అతడిని వదిలించుకోగా గుజరాత్‌ దక్కించుకుంది. ఈ క్రమంలో కెప్టెన్‌గా బాధ్యతలు కూడా అప్పగించింది. అందుకు తగ్గట్టుగానే గుజరాత్‌కు ఐపీఎల్‌ ట్రోఫీ అందించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..