IPL 2023: ఐపీఎల్ సీజన్ 16ని ఇలా ఫ్రీగా చూసేయండి.. పూర్తి వివరాలు మీకోసం..

|

Mar 31, 2023 | 7:11 AM

కలర్‌ఫుల్ క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ శుక్రవారం (మార్చి 31) ప్రారంభమవుతుంది. మొదటి దశలో 10 జట్ల మధ్య మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత ప్లేఆఫ్‌లు జరుగుతాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో వీక్షించవచ్చు.

IPL 2023: ఐపీఎల్ సీజన్ 16ని ఇలా ఫ్రీగా చూసేయండి.. పూర్తి వివరాలు మీకోసం..
అయితే ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప బంతుల్లో 100 వికెట్లు తీసిన టాప్ 4 బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Follow us on

కలర్‌ఫుల్ క్రికెట్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ శుక్రవారం (మార్చి 31) ప్రారంభమవుతుంది. మొదటి దశలో 10 జట్ల మధ్య మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత ప్లేఆఫ్‌లు జరుగుతాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో వీక్షించవచ్చు. అయితే, ఈసారి డిస్నీ హాట్‌స్టార్‌లో ఐపీఎల్ లైవ్ ఉండదు. ఎందుకంటే పారామౌంట్ గ్లోబల్, అంబాని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ Viacom18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రూ.20,500 కోట్లకు కొనుగోలు చేసింది. అంతేకాదు.. ఐపీఎల్‌ను ఉచితంగా ప్రసారం చేస్తామని కూడా ప్రకటించింది. దీని ప్రకారం, ఈసారి IPL ను Jio సినిమా యాప్‌లో వీక్షించవచ్చు. Jio సినిమా వెబ్ ద్వారా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో IPLని ఉచితంగా చూడవచ్చు.

విదేశాల్లో ఉన్న వారు ఇప్పటికే జియో సినిమా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. అయితే ఆయా దేశాల్లో జియో స్ట్రీమింగ్ అందుబాటులో లేకుంటే.. VPNని ఉపయోగించి ఉచిత ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. అలాగే, భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌ల ద్వారా టీవీలో మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

ఏ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం?

స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 1 SD, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ కన్నడ, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 HD (హిందీ), స్టార్ స్పోర్ట్స్ తమిళం, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ HD 3 (ఇంగ్లీష్) ఈ ఛానెళ్లు అన్నింటిలోనూ ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. మీరు విదేశాల్లో ఉన్నట్లయితే, IPL మ్యాచ్‌లను ఈ కింది ఛానెళ్లు, యాప్‌లలో వైల్ చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

యూకే ITVX, ఆస్ట్రేలియా ఫాక్స్ స్పోర్ట్స్, కెనడా విల్లో టీవీ, మిడిల్ ఈస్ట్ బీఐఎన్ స్పోర్ట్స్ 3, దక్షిణాఫ్రికా సూపర్ స్పోర్ట్స్, న్యూజిలాండ్ స్కై స్పోర్ట్స్ NZ, స్కై స్పోర్ట్స్ 2, పాకిస్తాన్ జియో సూపర్ (టిబిసి), బంగ్లాదేశ్ ఛానల్ 9, మాల్దీవులు YuppTv, Medianet.

జియో సినిమా యాప్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే ప్లేస్టోర్‌కి వెళ్లి JIO సినిమా యాప్ సెర్చ్ చేయండి. అక్కడ కనిపించే జియో సినిమా యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఆ తర్వాత హోమ్ పేజీలోకి వెళితే టాటా ఐపీఎల్ ఆప్షన్ కనిపిస్తుంది. మ్యాచ్‌లను చూడటానికి దానిపై క్లిక్ చేయండి. Apple ఫోన్ వినియోగదారులు Apple Store ద్వారా Jio సినిమా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..