IPL 2023, KKR vs RR: 16వ సీజన్ ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్ చెలరేగాడు. 47 బంతుల్లో అజేయంగా 98 పరుగులు చేసిన యశస్వీ.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకుని చరిత్ర సృష్టించాడు. దీంతో అటు మాజీల నుంచి, ఇటు ప్రత్యర్థి జట్ల నుంచి కూడా యశస్వీపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ క్రమంలోనే చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కూడా ‘నేను చూసిన బ్యాటింగ్ నాక్స్‌లో ఇది కూడా ఒకటి. యశస్వీ టాలెంట్ అద్భుతం’ అన్నట్లుగా ఆ యువ ఆటగాడి ఫోటోతో సహా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే అలా పోస్ట్ చేసిన కొద్ది సమయానికి కోహ్లీ దాన్ని డిలీట్ చేశాడు. ఇక దీనికి సంబంధించిన కారణం ఏమిటో తెలియని నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
కోహ్లీ అలా తన పోస్ట్‌ని డిలీట్ చేయడానికి కారణం లేకపోలేదు. అవును, కోహ్లీ చేసిన పోస్ట్‌లో వినియోగించిన జైస్వాల్ ఫొటో జియో సినిమాకు సంబంధించింది. ఇంకా మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లీ స్క్రీన్ షాట్ తీసి, ఆ ఫోటోనే పోస్ట్ కోసం వాడడంతో దాని మీద జియో సినిమా బ్రాండ్ నేమ్ కూడా కనిపించింది. నిజానికి ఈ ఐపీఎల్ సీజన్ కోసం విరాట్ కోహ్లీ స్టార్ స్పోర్స్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. విరాట్ కోహ్లీ- జియో సినిమాను ప్రమోట్ చేసేలా తన అధికారిక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో జియో సినిమా పేరు ఉన్న ఫొటోను పోస్ట్ చేయడం వల్ల వివాదం తలెత్తుతుందని భావించి తన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అయితే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Virat Kohli deleted the earlier Instagram story just to crop Jio Cinema ?? #YashasviJaiswal
earlier just now pic.twitter.com/mKnX3vrYFc
— Akshat (@AkshatOM10) May 11, 2023
కాగా, కోల్‌కతా vs రాజస్థాన్ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ టీమ్ ఘన విజయం అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ నీర్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. 150 రన్స్ టార్గెట్‌ని రాజస్థాన్ రాయల్స్ 13.1 ఓవర్స్‌లోనే చేధించింది. ఈ క్రమంలో రాజస్థాన్ తరఫున జాస్ బట్లర్ డకౌట్ అయ్యాడు. అయితే యశస్వీ 47 బంతుల్లో 98 పరుగులు, సంజూ శామ్సన్ 29 బంతుల్లో 48 రన్స్‌తో అజేయంగా జట్టును గెలిపించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..