IPL 2023: ‘పెద్ద ధోనిలా ఫీల్ అయ్యాడు’.. చివరికి లాస్ట్ ఓవర్‌లో తుస్సుమనిపించాడు..!

|

May 03, 2023 | 1:21 PM

సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది మూడో విజయం.

IPL 2023: పెద్ద ధోనిలా ఫీల్ అయ్యాడు.. చివరికి లాస్ట్ ఓవర్‌లో తుస్సుమనిపించాడు..!
Dc Vs Gt
Follow us on

సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది మూడో విజయం. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 5 పరుగుల తేడాతో గుజరాత్‌ను మట్టికరిపించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో అమన్ హకీమ్ ఖాన్(51), అక్షర్ పటేల్(27), రిపాల్ పటేల్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఫలితంగా లక్ష్యచేధనలో విఫలమైన గుజరాత్ కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేరు. టార్గెట్ 131.. అందులోనూ హార్దిక్ టీంలో హార్డ్ హిట్టర్లు ఉన్నారు. కచ్చితంగా గుజరాత్ కేక్ వాక్ అని అనుకున్నారు. కానీ ఢిల్లీ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్‌తో ఏమాత్రం బౌండరీలు ఇవ్వకుండా సమిష్టిగా పోరాడారు.

ఈ రన్ చేజ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా.. అర్ధసెంచరీ సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అయితే పిచ్ స్లో అయ్యి.. బౌలింగ్‌కి అనుకూలిస్తుండటంతో హార్దిక్ 53 బంతుల్లో 59 పరుగులు చేశాడు. మొదట్లో పాండ్యా బౌండరీలు బాదేసినా.. కీలక సమయాల్లో మాత్రం ఫోర్లు కొట్టడంలో విఫలమయ్యాడు. ఇక 19 ఓవర్‌లో మూడు సిక్సర్లు రాహుల్ టేవాటియా కొట్టినా.. పాండ్యా మాత్రం ఎలాంటి బౌండరీ సాధించలేదు. లాస్ట్ ఓవర్‌లో ధోని మాదిరిగా సిక్సర్లు కొట్టి ముగించాలని హార్దిక్ భావించినప్పటికీ.. ఇషాంత్ శర్మ పదునైన బంతులతో బోల్తాపడ్డాడు. చివరికి 5 పరుగులతో ఓటమిని చవి చూశాడు. కాగా, మ్యాచ్ అనంతరం ‘మేము అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం. ఒకట్రెండు లూజ్ ఓవర్లు లభిస్తాయని ఆశించాం. కానీ దొరకలేదు. మ్యాచ్ ముగించాలని అనుకున్నాం. కానీ కుదరలేదు. తప్పు మొత్తం తనదే అని ఓటమి బాధ్యతను తన మీద వేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.