IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ ట్రోఫీని డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేజేతులా పోగొట్టుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓడింది. తద్వారా చెన్నై సూపర్ కింగ్స్ 5వ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్ ఆద్యంతం గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం చెలాయించినా.. చివరి రెండు బంతుల్లో తడబడి ట్రోఫీని చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచింది. అయితే చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కనబర్చిన అత్యుత్సాహమే ఆ జట్టు కొంపముంచిందంటూ నెటిజన్లు, ఆ టీమ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తమదైన కోచింగ్, కెప్టెన్సీతో జట్టుకు విజయాలు అందించి, అరంగేట్ర సీజన్‌లోనే టీమ్‌ని ఛాంపియన్‌గా నిలబెట్టిన నెహ్రా-పాండ్యా.. చివరి మ్యాచ్‌లో జట్టు ఓటమికి కారణమయ్యారని అంటున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ ఆద్యంతం తనదైన జోరును కొనసాగించిన నెహ్రా.. ఫుట్‌బాల్ కోచ్ మాదిరి బౌండరీ లైన్ వద్ద నిలబడి పదే పదే ఆటగాళ్లతో మాట్లాడుతూ కీలక సలహాలు ఇస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నెహ్రా కోచింగ్‌ను వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శించినా.. అతను పట్టించుకోలేదు. విభిన్నరీతి కోచింగ్‌తో 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను టేబుల్ టాపర్‌గా నిలబెట్టడమే కాకుండా.. క్వాలిఫయర్-1లో ఓడినా రెండో క్వాలిఫయర్‌లో గెలిపించి ఫైనల్ చేరేలా చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ నెహ్రా తన మార్క్ కోచింగ్‌ను చూపించాడు. ఇదే తరహాలో కెప్టెన్‌గా హార్దిక్ రాణించాడు.
Moral of the story : Don’t give too much advise#IPL2023Finals #CSKvsGT#Nehra pic.twitter.com/rtolvSxOqH
— Vijay Chaure (@Vijj_14) May 30, 2023
అయితే ఫైనల్ మ్యాచ్ చివరి దశలో నెహ్రా అత్యుత్సాహం ప్రదర్శించాడు. మోహిత్ శర్మ వేస్తున్న చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమైన సమయంలో కూడా చెన్నై తరఫున బిగ్ షాట్స్ ఆడేందుకు జడేజా తడబడుతున్నాడు. అలా తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చిన మోహిత్ శర్మ మంచి మూమెంటమ్‌తో బౌలింగ్ చేస్తున్నాడు. కానీ అప్పుడే ఆశిష్ నెహ్రా కోచ్‌గా హద్దు దాటి మరీ కలగజేసుకున్నాడు. అదే సమయంలో నెహ్రాతో కెప్టెన్ హార్దిక్ కూడా కలిసి మోహిత్ శర్మకు వరుసగా అనవసర సలహాలు ఇచ్చి, అతన్ని ఒత్తిడిలో పెట్టాడు. మోహిత్ వేయాల్సిన చివరి ఓవర్ ఐదో బంతికి ముందు వాటర్ బాయ్‌తో అతనికి ప్రత్యేక సందేశం పంపి, బౌలింగ్ ప్రణాళికలో మార్పు చేయాలని సూచించేలా మాట్లాడాడు నెహ్రా.
Ur close friend giving tips in ur Relationship iz equal to @AshishNehra sending Tips while 2 ball 10 runs ?️?????❤️ pic.twitter.com/2ijQD49dhs
— Pranit SaWant (@PranitSawant007) May 30, 2023
చివరి రెండు బంతులు వేసేందుకు మోహిత్ టైమ్ తీసుకోవడంతో జడేజా ఊపిరి తీసుకున్నాడు. ఒత్తిడిని పక్కనపెట్టి స్వేచ్చగా భారీ షాట్లు ఆడగలిగాడు. నాలుగు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మోహిత్ శర్మ.. నెహ్రా అనవసర సూచనలతో పాటు హార్దిక్ పాండ్యా చిట్ చాట్‌తో మరింత ఒత్తిడికి గురయ్యాడు. చెన్నై విజయానికి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో.. మోహిత్ యార్కర్ వేసే ప్రయత్నంలో ఐదో బంతి స్లాట్‌లో పడగా జడేజా లాంగాన్ దిశగా అవసరమైన సమయంలో సిక్సర్ బాదాడు. దీంతో మరింత ఒత్తిడికి గురైన మోహిత్ శర్మ.. చివరి బంతిని లైన్ మిస్సై లెగ్ స్టంప్ దిశగా లో ఫుల్ టాస్ వేయగా.. జడేజా షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ రాబట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ని విజయ తీరాలకు చేర్చాడు. మోహిత్ శర్మకు ఎలాంటి సూచనలు చేయకుండా అలానే వదిలేస్తే అతను కట్టుదిట్టంగా వేసేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ.. కోచ్ నెహ్రాపై ఇంకా కెప్టెన్ హార్దిక్‌పై మండిపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..