గత కొన్ని రోజులుగా ఎంఎస్ ధోని ఫిట్‌నెస్‌పై అభిమానులను ఇబ్బంది పెట్టే వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2023 ప్రారంభ మ్యాచ్‌కు ముందు, ప్రాక్టీస్ సమయంలో మోకాలికి గాయం కావడంతో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడలేడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ధోనీ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేసినప్పటికీ.. ఆ వార్తలు నమ్మలేదు. వీటన్నింటికి చెక్ పెడుతూ.. ధోనీ గుజరాత్‌తో మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు. కానీ మ్యాచ్ సమయంలో మరోసారి గాయపడ్డాడు.
దీపక్ చాహర్ బంతిపై రాహుల్ తెవాటియా కొట్టిన షాట్‌ను ఆపడానికి ధోనీ డైవ్ చేశాడు. ఈ క్రమంలో బంతిని పట్టుకోబోయి ధోని కింద పడిపోయాడు. ఇంతకుముందు దెబ్బ తగిలిన మోకాలిపైనే పడ్డాడు. దీంతో కొద్దిసేపు ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు CSK కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తన ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
ఆ తర్వాత ధోనీ ఆటను కొనసాగించాడు. తాజాగా ఫ్లెమింగ్ మాట్లాడుతూ ధోని నొప్పితో మూలుగుతున్నాడు. అతను ప్రీ-సీజన్ మొత్తం నెలలో తన మోకాలి నొప్పిపై పనిచేశాడు. కానీ, మ్యాచ్ సమయంలో మాత్రమే తిమ్మిరి కలిగి ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. అయితే ధోని తదుపరి మ్యాచ్‌లో ఆడలేడంటూ చెప్పకొచ్చాడు.
CSK తమ తదుపరి మ్యాచ్‌ని ఏప్రిల్ 3న చెన్నైలో లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. CSK తిరిగి ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. గుజరాత్ టైటాన్స్ చేతిలో తొలి మ్యాచ్‌లోనే ఎదురుదెబ్బ తగిలిన చెన్నై.. బలహీనతలను అధిగమించాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..