ఎం. చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (CSK vs SRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోనీ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో చెన్నై టీం 4వ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్‌కే.. కాన్వే హాఫ్ సెంచరీతో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జట్టులో డెవాన్ కాన్వే అజేయంగా 77 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 35 పరుగులు చేశాడు. అతడికి తోడు కీపింగ్‌లో రాణించిన ధోనీ.. క్యాచ్, రనౌట్, స్టంప్ అవుట్ చేశాడు. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి ఎంఎస్ ధోని చేసిన రనౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో ధోనీ 3 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. తొలి వికెట్‌గా హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అందించిన అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకుని పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా వేసిన బంతికి మయాంక్ అగర్వాల్‌ను స్టంప్ చేయడంలో సఫలమయ్యాడు. అలాగే ఇన్నింగ్స్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్‌ను ధోనీ చాకచక్యంగా రనౌట్ చేశాడు. ఇప్పుడు ఈ రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోని చేసిన ఈ రనౌట్ ఇంతగా వైరల్ కావడానికి కారణం.. ధోనీ రనౌట్ కావడానికి కొన్ని సెకన్ల ముందు అంటే.. పతిరానా తన చివరి డెలివరీని వేయడానికి ముందు రనౌట్ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ తన గ్లౌస్‌ని తీసి కుడిచేత్తో స్టంప్‌పై బంతిని కొట్టినట్లు ప్రాక్టీస్ చేశాడు. పతిరానా వేసిన చివరి బంతికి భారీ షాట్ ఆడడంలో జాన్సెన్ విఫలమయ్యాడు. బంతి నేరుగా ధోనీ వైపు వెళ్లింది. వెంటనే ధోనీ ముందుగా ప్రాక్టీస్ చేసినట్లుగా బంతిని నేరుగా వికెట్లకు కొట్టడంలో సఫలమయ్యాడు. ఇప్పుడు ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆఖరి బంతికి రనౌట్ అవుతాడని ధోనికి ముందే తెలుసా అని ఆశ్చర్యపోతున్నారు.
Gloves off for the last ball!! A warm up for the throw!! Thats how he plan and practise for those moments!! #Dhoni #CSKvsSRH #AnbuDen Thala Dhoni pic.twitter.com/EeIYCotcnq
— Jaighanesh (@jaighanesh) April 21, 2023
ఇదే మ్యాచ్‌లో టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్‌గా ధోనీ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు గతంలో క్వింటన్ డికాక్ పేరిట ఉండేది. ఇప్పుడు అతడిని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ధోనీ, డి కాక్ మొత్తం 207 క్యాచ్‌లతో నంబర్ 1గా ఉన్నారు. మహేశ్ తీక్షనా బౌలింగ్‌లో ఆడమ్ మార్క్‌రమ్ క్యాచ్ పట్టి ధోనీ చరిత్ర సృష్టించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..