IPL 2023: కోవిడ్ పాజిటివ్‌గా తేలితే.. మైదానంలోకి నో ఎంట్రీ.. ఫ్రాంచైజీలకు షాకిచ్చిన కొత్త రూల్స్..

|

Mar 19, 2023 | 3:01 PM

IPL Covid Rules: ప్రస్తుతం కరోనావైరస్ పట్ల భయం లేదు. క్రికెట్ నుంచి ఇతర క్రీడల వరకు కోవిడ్ పాజిటివ్ ఆటగాళ్లు కూడా మైదానంలోకి ప్రవేశించడానికి అనుమతి పొందుతున్నారు.

IPL 2023: కోవిడ్ పాజిటివ్‌గా తేలితే.. మైదానంలోకి నో ఎంట్రీ.. ఫ్రాంచైజీలకు షాకిచ్చిన కొత్త రూల్స్..
Ipl 2023
Follow us on

ప్రస్తుతం కరోనావైరస్ పట్ల భయం లేదు. క్రికెట్ నుంచి ఇతర క్రీడల వరకు కోవిడ్ పాజిటివ్ ఆటగాళ్లు కూడా మైదానంలోకి ప్రవేశించడానికి అనుమతి పొందుతున్నారు. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ నుంచి ఇప్పటి వరకు, కోవిడ్ పాజిటివ్ ఆటగాళ్లు క్రికెట్‌లోని దాదాపు ప్రతి లీగ్, ద్వైపాక్షిక సిరీస్‌లలో ప్లేయింగ్-11లో భాగంగా ఉన్నారు. అయితే ఐపీఎల్ 2023లో అలా జరగదు.

IPL 2023 కోసం జారీ చేసిన వైద్య మార్గదర్శకాలలో, కోవిడ్ పాజిటివ్ ప్లేయర్ ఒక వారం పాటు ఒంటరిగా ఉండవలసి ఉంటుందని తెలుస్తోంది. ‘భారతదేశంలో కోవిడ్-19 కేసులలో గణనీయమైన తగ్గుదల ఉంది. అయితే క్రమమైన వ్యవధిలో వస్తున్న విభిన్న వేరియంట్‌ల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి పరిస్థితిలో, ఈ వైరస్‌తో బాధపడుతున్న ఆటగాళ్లు గరిష్టంగా ఏడు రోజుల పాటు ఒంటరిగా ఉండవలసి ఉంటుంది. ఈ ఐసోలేషన్ కాలంలో, కోవిడ్ పాజిటివ్ ప్లేయర్ మ్యాచ్‌లతో పాటు అన్ని రకాల కార్యకలాపాలు, ఈవెంట్‌లకు దూరంగా ఉండాలి’ అని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

6 రోజుల తర్వాత జట్టులోకి..

IPL 2023 కోసం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు అన్ని ఫ్రాంఛైజీలకు అందించారు. కోవిడ్ పాజిటివ్ ప్లేయర్‌లకు ఐదో రోజు పరీక్షలో నెగెటివ్ వచ్చి, ఆపై 24 గంటల్లో వారి రెండో టెస్ట్ రిపోర్ట్ కూడా నెగెటివ్ వస్తే, ఆరో రోజు నుంచి జట్టులో చేరవచ్చని అందులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది ఆగస్టు నుంచి మినహాయింపు..

కామన్వెల్త్ గేమ్స్ 2022 నుంచి, క్రికెట్‌లోని కోవిడ్ పాజిటివ్ ప్లేయర్‌లు మ్యాచ్‌లో పాల్గొనడానికి మినహాయింపు పొందారు. CWG 2022లో భారత్‌తో జరిగిన మహిళల టీ20 మ్యాచ్‌లో, ఆస్ట్రేలియాకు చెందిన తహిలా మెక్‌గ్రాత్‌కు కోవిడ్ పాజిటివ్ ఉన్నప్పటికీ ప్లేయింగ్-11లో చోటు కల్పించారు. అప్పటి నుంచి క్రికెట్‌లో చాలా సందర్భాలలో, కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ఆటగాళ్ళు ఆడటం కనిపిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..