MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌ చేసేది ఎప్పుడంటే.. రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Apr 04, 2023 | 6:41 PM

Ravindra Jadeja: ఐపీఎల్ 2023లో, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఖాతా తెరిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. తన రెండో మ్యాచ్‌లో లక్నోపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌ చేసేది ఎప్పుడంటే.. రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు..
Ms Dhoni Ravindra Jadeja
Follow us on

Ravindra Jadeja On MS Dhoni’s Retirement: ఐపీఎల్ 2023లో, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ విజయం ఖాతా తెరిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. తన రెండో మ్యాచ్‌లో లక్నోపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. అదే సమయంలో ఈ సీజన్‌లో ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ జోరందుకుంది. ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని చెబుతున్నారు. తాజాగా దీనిపై రవీంద్ర జడేజా కీలక ప్రకటన చేశాడు.

ఐపీఎల్‌కు ధోనీ ఎప్పుడు, ఎలా గుడ్‌బై చెబుతాడంటే..

ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ ఆడడని, ఇదే అతడి చివరి ఐపీఎల్ అని 42 ఏళ్ల మహేంద్ర సింగ్ ధోని గురించి నిరంతరం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి మధ్య చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ, “మహేంద్ర సింగ్ ధోనీ భాయ్‌కు ఎప్పుడు, ఏం చేయాలో తెలుసు. ఒకవేళ అతను ఐపీఎల్‌లో ఆడడం కొనసాగించాలనుకుంటే, చేస్తాడు. వీడ్కోలు పలకాలని అనుకుంటే, సైలెంట్‌గా కానిచ్చేస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

చెపాక్‌లో 1426 రోజుల తర్వాత చెన్నై విజయం..

చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 1426 రోజుల తర్వాత చెపాక్‌లో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. రుతరాజ్ గైక్వాడ్, డ్వేన్ కాన్వాయ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. రుతురాజ్ 31 బంతుల్లో 54 పరుగులు, కాన్వే 29 బంతుల్లో 47 పరుగులు చేశారు. రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు, కాన్వే ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అనంతరం కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో ఓపెనింగ్‌కు దిగిన కైల్ మేయర్స్ 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..