
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు గత రెండు సీజన్‌లు అంతగా కలిసి రాలేదు. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు వరుసగా రెండు సీజన్‌లలో ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడంలో విఫలమైంది. ఈసారి జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. అయితే టోర్నమెంట్ నుంచి సూపర్ స్టార్ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మినహాయించడం వల్ల ముంబై ప్రణాళికలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. కానీ, ఇది కొంతమంది బౌలర్లకు అవకాశాలను సృష్టించింది. ప్రస్తుతానికి అందరి నాలుకపై నిలిచిన పేరు – అర్జున్ టెండూల్కర్. ఈసారి ముంబై ఇండియన్స్ అతనికి అవకాశం ఇస్తుందా? కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ మార్క్ బౌచర్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
కొత్త సీజన్‌లో ముంబై తన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఏప్రిల్ 2 ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు స్టార్ ఇంగ్లిష్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌తో పాటు ముంబై ఏ ఫాస్ట్ బౌలర్‌ను బరిలోకి దించనుందో ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్‌తో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేస్తాడా? టోర్నమెంట్‌కు ముందు, ముంబై మార్చి 29 బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. అర్జున్ టెండూల్కర్ ప్రశ్న కూడా ఈ సమావేశంలో వినిపించింది.
బుమ్రా గైర్హాజరీలో అర్జున్‌కి అవకాశం వస్తుందో లేదా అని అందరూ అనుకుంటున్నారు. ఇదే ప్రశ్నను ముంబై కొత్త కోచ్ మార్క్ బౌచర్‌ని అడిగినప్పుడు, అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వడానికి బదులుగా, అతను ఎంపికకు ఛాన్స్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. అర్జున్ ఇటీవలి దేశీయ సీజన్‌ను ప్రస్తావిస్తూ.. అతని బౌలింగ్ మెరుగ్గా ఉందని వివరించాడు. అయితే అర్జున్ ఇటీవల గాయపడ్డాడని బౌచర్ వెల్లడించాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను సీజన్‌లో ఎంపికకు అందుబాటులో ఉంటే జట్టుకు మంచిదని బౌచర్ స్పష్టం చేశాడు.
అదే సమయంలో, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఎటువంటి హామీ ఇవ్వలేదు. ఇది కూడా సహజమైనదే. అయితే ఈ సీజన్‌లో అర్జున్ తన అరంగేట్రం చేయగలడని ముంబై వెటరన్ కెప్టెన్ ఆశించాడు.
భారత గ్రేట్ బ్యాట్స్‌మెన్, తొలి ముంబై కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇంకా IPL అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో రూ. 20 లక్షలకు ముంబై ఇండియన్స్ అతడిని మొదట కొనుగోలు చేసింది. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. 2022 సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలానికి ముందు, ముంబై అతన్ని మళ్లీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ, మరోసారి మొత్తం సీజన్ బెంచ్‌లోనే కూర్చున్నాడు. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్జున్ ఇప్పటి వరకు 9 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, అందులో 12 వికెట్లు అతని ఖాతాలో చేరాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..