IPL 2022 Points Table: రెండో స్థానానికి దూసుకొచ్చిన రాహుల్ సేన.. పాయింట్ల పట్టికలో ఏ జట్లు ఏయే స్థానాల్లో ఉన్నాయంటే..

IPL 2022 Points Table: ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ (LSG vs DC) జట్లు తలపడ్డాయి.

IPL 2022 Points Table: రెండో స్థానానికి దూసుకొచ్చిన రాహుల్ సేన.. పాయింట్ల పట్టికలో ఏ జట్లు ఏయే స్థానాల్లో ఉన్నాయంటే..
Lucknow Super Giants

Edited By:

Updated on: Apr 08, 2022 | 11:40 AM

IPL 2022 Points Table: ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ (LSG vs DC) జట్లు తలపడ్డాయి. డికాక్‌ అర్ధసెంచరీతో రాణించడంతో రాహుల్‌ సేన 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. తద్వారా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. క్వింటన్‌ డికాక్‌(80) రన్స్‌ తో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది రాహుల్‌ సేన. అదే సమయంలో ఢిల్లీ ఏడో ప్లేసులోకి దిగజారింది. ఇక మిగతా జట్ల విషయానికొస్తే.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీతో మ్యాచ్‌ ముందు వరకు ఐదో స్థానంలో ఉన్న లక్నో రెండో స్థానానికి చేరుకుంది. ఇక సంజూశామ్సన్‌ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ ( రెండు విజయాలు) నాలుగు, మయాంక్‌ నాయకత్వంలోని పంజాబ్‌ కింగ్స్‌ ( రెండు విజయాలు, ఒక ఓటమి) ఐదు,రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ( రెండు విజయాలు, ఒక ఓటమి) ఆరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ ( ఒక గెలుపు, రెండు ఓటమి) ఏడు, ఇప్పటిదాకా టోర్నీలో విజయాల ఖాతా తెరవని చెన్నై వరుసగా 8,9 వ స్థానాల్లో ఉండగా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అట్టడుగు స్థానంలో ఉంది.

ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో..

ఇక టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లకు బహూకరించే ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టోర్నీలో అతను ఇప్పటివరకు 143 స్ట్రైక్‌ రేట్‌తో 205 పరుగులు సాధించాడు. ఇందులో ఇక సెంచరీ, హాఫ్‌ సెంచరీ కూడా ఉంది. 3 మ్యాచ్‌ల్లో 149 పరుగులు చేసిన ముంబై బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ రెండోస్థానంలో ఉన్నాడు. నేటి మ్యాచ్‌లో 80 పరుగులతో పాటు మొత్తం 4 మ్యాచ్‌ల్లో 149 రన్స్‌ చేసిన క్వింటన్‌ డికాక్‌ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ఆ తర్వాతి స్థానాల్లో లక్నో కెప్టెన్‌ కే.ఎల్‌. రాహుల్‌ (132), దీపక్‌ హుడా (130 ) ఉన్నారు.

పర్పుల్‌ క్యాప్‌ రేసులో..

ఇక టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌కు అందించే పర్పుల్‌ క్యాప్‌ రేసులో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్‌ మొదటి స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రాజస్థాన్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్ (7వికెట్లు) రెండో స్థానంలో, లక్నో బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ (7 వికెట్లు) మూడో ప్లేసులో ఉన్నారు. ఇక మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో రాహుల్‌ చాహర్‌ నాలుగు, ఢిల్లీ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (6 వికెట్లు) ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు.
Also Read: LSG vs DC, IPL 2022: మెరిసిన డికాక్‌.. హ్యాట్రిక్ విజయాలతో మురిసిన లక్నో..

Viral Video: సూట్ వేసుకొని పానీపూరి అమ్ముతున్న యువకులు.. కారణమేంటో తెలిస్తే షాకే..

పుష్కరానికి ఒక్కసారే పూస్తుంది !! పూసిన వెంటనే వాడిపోతుంది !!