IPL 2022: ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు ఇప్పటికే బీసీసీఐ బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు 10 జట్లు రెండు టీంల కోసం బిడ్లను సమర్పించాయని తెలుస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లోని తాజ్ దుబాయ్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టినట్లు సమాచారం. మొత్తం ఆరు నగరాలు అహ్మదాబాద్, లక్నో, కటక్, ధర్మశాల, గౌహతితోపాటు ఇండోర్ ఫ్రాంచైజీలను సొంతం చేసుకోవడానికి బిడ్లను వేశారు. అయితే ఇందులో మాంచెస్టర్ యునైటెడ్‌పైనే చర్చ నడుస్తోంది.
సంజీవ్ గోయెంకా యాజమాన్యంలోని అదానీ గ్రూప్, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ బిడ్లను సమర్పించిన ఇతర కంపెనీలలో ముఖ్యమైనదిగా ఉన్నాయి. అలాగే ఒకరు ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా ఉన్నట్లు సమాచారం.
అన్ని పార్టీలు రెండు ఎన్వలప్‌లను సమర్పించవలసిందిగా బీసీసీఐ కోరింది. ఇందులో ఒక ఎన్వలప్ వ్యక్తిగత, రెండోది ఆర్థికమైన ఆధారాల కోసమని తెలుస్తోంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) దాని చట్టపరమైన, ఆడిట్ అధికారులు తొలుత ఆధారాలను తనిఖీ చేస్తారని, అవి సక్రమంగా ఉంటేనే బిడ్‌తో కూడిన రెండవ కవరు తెరవనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ ప్రక్రియకు మరికొన్ని గంటలు పడుతుందని భావిస్తున్నారు. సాయంత్రం లోపు రెండు జట్లు ప్రకటించే అవకాశం ఉంది.
The stage is set! ? ?
Bidding for the 2⃣ new IPL teams to commence shortly! pic.twitter.com/Vsu58ZA83d
— BCCI (@BCCI) October 25, 2021
Also Read: Pak vs Ind: “వాదనలు” చేశారు.. మధ్యలోనే వెళ్లిపోయారు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Ind Vs Pak: భారత జట్టుకు ఇది హెచ్చరిక.. అన్నీ మరిచిపోయి మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించండి..