IPL 2022: సురేష్ రైనాతో 5 నిమిషాల సమావేశం.. ఈ ఆటగాడి జీవితాన్నే మార్చేసింది..

|

Apr 04, 2022 | 10:01 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తొలి వారంలోనే అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఎంతోమంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో ముంబై ఇండియన్స్ (MI)కి చెందిన తిలక్ వర్మ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే అద్భుతాలు చేశాడు.

IPL 2022: సురేష్ రైనాతో 5 నిమిషాల సమావేశం.. ఈ ఆటగాడి జీవితాన్నే మార్చేసింది..
Tilak Varma
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో తొలి వారంలోనే అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఎంతోమంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇందులో ముంబై ఇండియన్స్ (MI)కి చెందిన తిలక్ వర్మ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే అద్భుతాలు చేశాడు. 2014 సంవత్సరంలో జరిగిన మిస్టర్ IPL సురేష్ రైనాతో జరిగిన సమావేశంతో.. తన అదృష్టాన్ని ఎలా మార్చుకున్నాడో తిలక్ వర్మ పేర్కొన్నాడు. 2014 సంవత్సరంలో, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మ్యాచ్ సందర్భంగా రైనాను కలుసుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ IPL సురేష్ రైనా ఫోటో సెషన్ కోసం యువ ఆటగాళ్లను కలిశాడు. వీరిలో 12 ఏళ్ల తిలక్ వర్మ కూడా ఉన్నాడు.

సురేశ్ రైనాతో ఐదు నిమిషాల సమావేశం..

ఈమేరకు కోచ్ సలామ్ బయేష్ మాట్లాడుతూ, ‘నాకు తెలిసిన ఒక మేనేజర్ ఉన్నాడు, అతని సహాయంతో మేం గ్రౌండ్‌కి వెళ్ళాం. నేను కూడా నాతో తిలక్‌ని తీసుకువెళ్లాను. సురేష్ రైనా బ్యాటింగ్ చూసి తిలక్ ఎలా ఆశ్చర్యపోయాడో చూశాను. అతను సురేష్ రైనా ఒక్క షాట్‌ను కూడా మిస్ చేయలేదు. తర్వాత మేం సురేష్ రైనాను కలిశాం. అదే సమావేశం తిలక్ ప్రస్తుతం క్రికెటర్‌గా మార్చింది’ అని చెప్పుకొచ్చాడు.

IPL 2022 ముంబై ఇండియన్స్‌కు సరిగ్గా ప్రారంభం కాలేదు. ముంబై తన రెండు ఓపెనింగ్ మ్యాచ్‌లలో ఓడిపోయింది. అయితే తిలక్ వర్మ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం మెరుగ్గా ఉంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ 22, 61 పరుగులు చేశాడు. తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది.

ఎలక్ట్రీషియన్ కొడుకైన తిలక్ వర్మ.. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఎందరో పెద్ద స్టార్ల మనసు గెలుచుకున్నాడు. ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే కూడా తిలక్ వర్మ అభిమానిగా మారాడు. అతని ఆటను తీవ్రంగా ప్రశంసిస్తున్నాడు.

Also Read: IPL 2022 Uncapped Players: ఆయుష్ నుంచి లలిత్ వరకు.. ఐపీఎల్ 2022‌లో అదరగొడుతోన్న అన్‌క్యాప్డ్ ప్లేయర్స్..

RR vs RCB IPL 2022 Match Preview: హ్యాట్రిక్‌పై కన్నేసిన రాజస్థాన్.. బెంగళూరుతో పోరుకు సిద్ధం.. బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?