IPL 2022: హైదరాబాద్ టార్గెట్ 211.. హాఫ్ సెంచరీతో శాంసన్.. 246 స్ట్రైక్‌రేట్‌తో షిమ్రాన్ హెట్మెయర్ అద్భుత ఇన్నింగ్స్..

|

Mar 29, 2022 | 9:31 PM

SRH Vs RR: తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

IPL 2022: హైదరాబాద్ టార్గెట్ 211.. హాఫ్ సెంచరీతో శాంసన్.. 246 స్ట్రైక్‌రేట్‌తో షిమ్రాన్ హెట్మెయర్ అద్భుత ఇన్నింగ్స్..
Ipl 2022 Sunrisers Hyderabad Vs Rajasthan Royals
Follow us on

ఐపీఎల్ -2022 (IPL 2022) లో రాజస్థాన్ రాయల్స్ మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతోంది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ రెండు జట్లు ఢీకొంటున్నాయి. ఐపీఎల్‌లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ముందు 211 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రాజస్థాన్ రాయల్స్ సారథి శాంసన్(55) కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దేవదత్ పడిక్కట్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ 35, జైస్వాల్ 20 పరుగులు చేశారు. షిమ్రాన్ హెట్మెయర్ 32 పరుగులు, రియాన్ పరాగ్ 12 పరుగులు చేశారు. సన్ రౌజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2, నటరాజన్ 2, షెఫార్డ్, భుమనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

SRH vs RR జట్లు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్-నైల్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్(కెప్టెన్), నికోలస్ పూరన్(కీపర్), ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్