SRH vs RR – IPL 2022: సన్‌రైజర్స్‌కు షాక్.. 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..

|

Mar 30, 2022 | 1:08 AM

SRH vs RR - IPL 2022: ఐపీఎల్ 2022(IPL 2022) ఐదవ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది.

SRH vs RR - IPL 2022: సన్‌రైజర్స్‌కు షాక్.. 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..
Rajasthan Royals
Follow us on

SRH vs RR – IPL 2022: ఐపీఎల్ 2022(IPL 2022) ఐదవ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొత్త సీజన్‌లో మిగిలిన జట్ల తర్వాత ఈ రెండు జట్లు కూడా తొలి మ్యాచ్‌ ఆడగా.. సన్ రైజర్స్ టీమ్‌కు ఊహించిన షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది సన్‌రైజర్స్ టీమ్. దాంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసింది. సామ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 55 పరుగులు చేసి జట్టు స్కోరు భారీగా పెంచాడు. ఇక పడిక్కల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 41 పరుగులు చేశాడు. షిమ్రాన్ హెట్మెయర్ (32), జాస్ బట్లర్ (35), జైస్వాల్ (20) తో దుమ్ము రేపారు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి 211 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ముందు ఉంచారు. అయితే లక్ష్య చేధనలో సన్‌రైజర్స్ చతికిల పడిపోయింది. టాప్ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. కెప్టెన్ మొదలు.. టాప్ బ్యాట్స్‌మెన్ అందరూ సింగిల్ డిజిల్ స్కోర్‌కే పరిమితం అయ్యారు. ఆరవ ప్లేస్‌లో వచ్చిన ఐడెన్ మార్క్రామ్ 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 40, షెపార్డ్ 24 ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ టీమ్.. 149 పరుగులు మాత్రమే చేసింది. 61 పరుగుల తేడాతో తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

SRH vs RR జట్లు:
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ కౌల్టర్-నైల్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్(కెప్టెన్), నికోలస్ పూరన్(కీపర్), ఐడెన్ మార్క్రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

Also read:

Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!

TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..

Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..