IPL 2022: రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కెప్టెన్‌గా అతని రికార్డు చాలా గొప్పది. ఐదుసార్లు ముంబై జట్టుని విజేతగా నిలిపాడు. కానీ ఇప్పుడు కాలం మారింది. 2022లో వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీని తిట్టిన వారు ఇప్పుడు రోహిత్ శర్మ గురించి ఏం చెబుతారు.. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఓడించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ కూడా ముంబైని ఓడించాయి. చివరగా శనివారం లక్నో దాడిలో కూడా రోహిత్ సేన ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ ఇప్పుడు ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం.
ఇప్పుడు రోహిత్ శర్మ విరాట్‌తో సమానం
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే ఈ జట్టు కంటే ముందు 2019 సంవత్సరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మొదటి 6 మ్యాచ్‌లలో ఓడిపోగా, 2013 సంవత్సరంలో మహేల జయవర్ధనే నేతృత్వంలోని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఇదే గతిపట్టింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏమైంది..?
రోహిత్ శర్మను బెస్ట్ కెప్టెన్ అని పిలిచే వారు వరుసగా 6 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఏం చెబుతారు.. రోహిత్ మ్యాజిక్ ఎక్కడ కనుమరుగైందనేది అందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఒక్కటే సమాధానం ఏ కెప్టెన్ అయినా తన జట్టు బాగున్నప్పుడే అతడికి విజయాలు వస్తాయి. ధోనీ ప్రపంచకప్ 2011 విజయంతో ముడిపడి ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధోనీనే హీరోగా నిలిచాడు. దీనికి కారణం అతడి వెనుక మంచి టీమ్ ఉండటం. ఐపీఎల్ 2022లో రోహిత్ శర్మకు మునుపటిలా సమర్ధవంతమైన జట్టు లేదు. అతనికి ట్రెంట్ బౌల్ట్ లేదా రాహుల్ చాహర్ లాంటి లెగ్ స్పిన్నర్ లేడు. బ్యాటింగ్ బాగానే ఉంది కానీ బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడు అని అందరు అంటున్నారు..