IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌లో బెంగళూర్‌దే హవా.. టాప్ లిస్టులో ఎవరున్నారంటే?

|

Apr 13, 2022 | 7:29 AM

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు (CSK vs RCB) మధ్య జరిగిన పోరులో RCB ఓడిపోయి ఉండవచ్చు.. కానీ, హసరంగ తన వికెట్ల ఖాతాలో మరో ఇద్దరిని తన బాధితులను చేర్చుకున్నాడు. ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను సమం చేశాడు.

IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌లో బెంగళూర్‌దే హవా.. టాప్ లిస్టులో ఎవరున్నారంటే?
Ipl Purple Cap Wanindu Hasaranga
Follow us on

IPL 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన ఇప్పటివరకు మెరుగ్గానే ఉంది. జట్టు స్థిరమైన విజయాలను అందుకుంది. అయితే, నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం పరాజయం పాలైంది. అయితే, అంతకుముందు బెంగళూరు విజయాల్లో బలమైన బౌలింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగా(Wanindu Hasaranga) తన ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. RCB ఈ కొత్త ఆయుధం బ్యాట్స్‌మెన్‌లను తన స్పిన్ వలలో చిక్కుకుపోయేలా చేసి, ఇబ్బందులకు గురి చేసింది. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌(IPL Purple Cap)ను సొంతం చేసుకోవడానికి అర్హత సంపాదించాడు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు (CSK vs RCB) మధ్య జరిగిన పోరులో RCB ఓడిపోయి ఉండవచ్చు.. కానీ, హసరంగ తన వికెట్ల ఖాతాలో మరో ఇద్దరిని తన బాధితులను చేర్చుకున్నాడు. ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లను సమం చేశాడు. అయితే, నంబర్ వన్ స్థానంలో RCB మాజీ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన సత్తా చాటుతున్నాడు.

ఏప్రిల్ 12 మంగళవారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో చెన్నై వర్సెస్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు చెందిన హసరంగ రెండు వికెట్లు తీశాడు. ఈ విధంగా ఐదు మ్యాచ్‌ల తర్వాత 10 వికెట్లు తీశాడు. మునుపటిలా ఇప్పటికీ నాలుగో స్థానంలోనే ఉన్నా.. 10 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్‌లతో కలిసి సమానమయ్యాడు. ఎకానమీ రేటు మాత్రమే తేడా ఉంది. మెరుగైన ఎకానమీ రేటు కారణంగా ఉమేష్, కుల్దీప్ హసరంగ కంటే ముందున్నారు. ఉమేష్ యాదవ్ రెండో స్థానంలో, కుల్దీప్ మూడో స్థానంలో ఉన్నారు. టి నటరాజన్ 8 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

చెన్నై బౌలర్ల పరిస్థితి..

సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు చెలరేగిపోయారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే చెన్నై బౌలర్లు తరచూ విరామాల్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు. శ్రీలంక స్పిన్నర్ మహిష్ తీక్షణ తన రెండో మ్యాచ్ ఆడుతూ 4 వికెట్లు పడగొట్టాడు. ఇది ఐపీఎల్‌లో చెన్నై మొదటి విజయం. కాగా, జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. అయితే, ఈ ఇద్దరు బౌలర్లు ప్రస్తుతం పర్పుల్ క్యాప్ కోసం పోటీలో లేరు. చెన్నై అనుభవజ్ఞుడైన బౌలర్ డ్వేన్ బ్రావో కేవలం 1 వికెట్ మాత్రమే సాధించాడు. అయితే అతను జట్టు తరపున అత్యధికంగా 7 వికెట్లు తీసి 10వ స్థానంలో ఉన్నాడు.

బెంగళూర్ మాజీ స్పిన్నర్ నంబర్ 1..

హసరంగా కంటే ముందు, RCB టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గత అనేక సీజన్‌లలో కాకుండా ఈసారి కూడా తన సత్తా చాటుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున తొలిసారి ఆడుతున్న చాహల్.. 4 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 11 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. చాహల్ ఎకానమీ రేట్ కూడా మిగతా వారి కంటే మెరుగ్గా ఉండడంతో కేవలం 6.40 పరుగుల ఎకానమీతో పరుగులు ఇచ్చాడు.

Also Read: IPL 2022: 4 సార్లు ఓడినా.. ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన.. చెన్నైలా ముంబై విజయాల ఖాతా తెరిచేనా?

IPL 2022: భారత ఆటగాళ్లకు శాపంగా మారిన కెప్టెన్సీ.. కేఎల్ రాహుల్ నుంచి హార్దిక్ పాండ్యా వరకు.. అందరి పరిస్థితి దారుణమే..