ఐపీఎల్ 2022(IPL 2022) మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్(GT vs RR)పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్ కల చెదిరిపోయింది. గుజరాత్ టైటాన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తర్వాత తొలిసారి ఐపీఎల్ లీగ్‌లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచిన రెండో జట్టుగా నిలిచింది. ఈ లీగ్‌లో చాలా మంది ఆటగాళ్లు అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన కనబరిచారు. ఈ సీజన్‌లో వ్యక్తిగత రికార్డులు సాధించిన ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సెంచరీలు..
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ 4 సెంచరీలు చేశాడు.
భారీ ఇన్నింగ్స్..
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ 140 * పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
డాట్ బాల్స్..
రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ప్రసిద్ధ్ కృష్ణ అత్యధికంగా 200 డాట్ బాల్స్ బౌలింగ్ చేశాడు.
అత్యుత్తమ బౌలర్ సగటు..
5 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన బౌలర్లలో, లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన మొహ్సిన్ ఖాన్ అత్యుత్తమ సగటు (14.07)తో ఆకట్టుకున్నాడు.
అత్యంత ఖరీదైన స్పెల్..
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB ఆటగాడు జోస్ హేజిల్‌వుడ్ 4 ఓవర్లలో 64 పరుగులు సమర్పించుకున్నాడు.
అత్యుత్తమ ప్రదర్శన..
కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా 10 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు.
ఉత్తమ స్ట్రైక్ రేట్..
5 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన వారిలో, KKR యొక్క ఆండ్రీ రస్సెల్ 9.94 స్ట్రైక్ రేట్‌తో వికెట్లు తీశాడు.
ఉత్తమ ఎకానమీ రేటు..
కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ 5.57 ఎకానమీతో 14 మ్యాచ్‌ల్లో రాణించాడు.
అత్యధిక వికెట్లు..
రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు.
వేగవంతమైన శతకం..
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన రజత్ పాటిదార్ కేవలం 49 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
ఎక్కువ అర్ధసెంచరీలు..
IPL 2022లో అత్యధిక అర్ధశతకాలు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ సాధించాడు. అతను తన బ్యాట్‌తో 12 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీలు సాధించాడు.
అత్యధిక ఫోర్లు, సిక్సర్లు..
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2022లో అత్యధికంగా 83 ఫోర్లు, 45 సిక్సర్లు కొట్టాడు.
అత్యధిక పరుగులు..
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఐపీఎల్ 2022లో అత్యధికంగా 863 పరుగులు చేశాడు.
అత్యధిక వికెట్లు..
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ 17 మ్యాచుల్లో 27 వికెట్లు పడగొట్టాడు.