9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు.. 340పైగా స్ట్రైక్‌రేట్.. కేకేఆర్ బౌలర్ల పాలిట పీడకలగా మారిన పంజాబ్ బ్యాటర్..

IPL 2022, PBKS vs KKR: అయితే, ఈ మ్యాచ్‌లో భానుకా రాజపక్సే అద్భుత బ్యాటింగ్‌తో మైదానాన్ని హుసారెత్తించాడు. శివం మావి బౌలింగ్‌లో చుక్కలు చూపించాడు. రాజపక్సే తుఫాన్ బ్యాటింగ్‌తో పాపం శివం మావి బలయ్యాడు.

9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు.. 340పైగా స్ట్రైక్‌రేట్.. కేకేఆర్ బౌలర్ల పాలిట పీడకలగా మారిన పంజాబ్ బ్యాటర్..
Ipl 2022 Bhanuka Rajapaksa
Follow us
Venkata Chari

|

Updated on: Apr 01, 2022 | 8:22 PM

IPL 2022, PBKS vs KKR: ఈరోజు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య 8వ మ్యాచ్ జరుగుతోంది. మంచు కారణంగా కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పేసర్ కగిసో రబాడ పీబీకేఎస్ తరపున ఆడుతున్నాడు. పంజాబ్‌ కింగ్స్ తరపున ఇదే అరంగేట్రం. మరోవైపు, ఈ ఫ్రాంచైజీ కోసం కేకేఆర్ స్పీడ్ స్టార్ ఉమేష్ యాదవ్(Umesh Yadav) ఈరోజు తన 50వ మ్యాచ్‌ను ఆడుతున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భానుకా రాజపక్సే(Bhanuka Rajapaksa) అద్భుత బ్యాటింగ్‌తో మైదానాన్ని హుసారెత్తించాడు. శివం మావి బౌలింగ్‌లో చుక్కలు చూపించాడు. రాజపక్సే తుఫాన్ బ్యాటింగ్‌తో పాపం శివం మావి బలయ్యాడు. రాజపక్సే ఆడింది కేవలం 9 బంతులు మాత్రమే. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సులతో 31 పరుగులు సాధించాడు. ఈక్రమంలో రాజపక్సే స్ట్రైక్ రేట్ 344.44గా ఉండడం విశేషం.

ఒక ఓవర్.. మూడు సిక్సులు, ఒక ఫోర్..

4వ ఓవర్ వేసేందుకు వచ్చిన శివం మావిని తొలి బంతి నుంచే చెడుగుడు ఆడుకున్నాడు. దయ, జాలిలాంటివి చూపించకుండా కుమ్మేశాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన రాజపక్సే, ఆ తర్వాత మూడు బంతులను భారీ సిక్సులుగా మలిచాడు. ఇదే ఊపులో హాఫ్ సెంచరీవైపు దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఈసారి స్లో బంతి వేయడంతో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. లేకుంటే ఈ రోజు ఐపీఎల్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకునేవాడు.

ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ తొలి వికెట్‌ను పడగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాడు. దీంతో ఐపీఎల్ పవర్ ప్లేలో 50 వికెట్లు కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ లిస్టులో చేరిన నాలుగో బౌలర్‌గా మారాడు. జహీర్ ఖాన్ (52), సందీప్ శర్మ (52), భువనేశ్వర్ కుమార్ (51) ఉమేష్ యాదవ్ కంటే ముందే ఈ లిస్టులో చేరారు.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్‌ ఎలెవన్‌ : మయాంక్ అగర్వాల్ ( కెప్టెన్‌), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స (వికెట్‌ కీపర్‌), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్‌ ఎలెవన్‌: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(వికెట్‌ కీపర్‌), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

Also Read: KKR vs PBKS Live Score, IPL 2022: టాస్ గెలిచిన కోల్ కతా.. పంజాబ్ పై ఆధిపత్యం చెలాయిస్తుందా?

IPL 2022: కోల్‌కతా, బెంగళూరు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న కీలక ప్లేయర్లు..