IPL 2022: 7.25 కోట్ల ఆటగాడు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మినహాయించి మిగతా ప్రదర్శన అంతంత మాత్రమే..!

|

Apr 16, 2022 | 9:57 AM

IPL 2022: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు తమ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి ఐపీఎల్ మంచి వేదికగా నిలుస్తోంది . యువ క్రికెటర్లకి కూడా ఇక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి.

IPL 2022: 7.25 కోట్ల ఆటగాడు.. ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ మినహాయించి మిగతా ప్రదర్శన అంతంత మాత్రమే..!
Pat Cummins
Follow us on

IPL 2022: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు తమ టాలెంట్‌ని నిరూపించుకోవడానికి ఐపీఎల్ మంచి వేదికగా నిలుస్తోంది . యువ క్రికెటర్లకి కూడా ఇక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. ఐపీఎల్‌లో లక్షల రూపాయల ఆటగాళ్లు ఉన్నారు. కోట్ల రూపాయల ఆటగాళ్లు ఉన్నారు. కానీ అందరు ఆటగాళ్లు వారి జట్లకి, తీసుకున్న రెమ్యునరేషన్‌కి న్యాయం చేయలేరు. కొంతమంది ఫెయిల్‌ అయితే మరికొంతమంది సక్సెస్ జాబితాలో ఉంటారు. తాజాగా ఒక ఆటగాడి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.7.25 కోట్లకు పాట్ కమిన్స్‌ని కొనుగోలు చేసింది. కానీ అతని ఆటతీరు చాలా పేలవంగా ఉంది. ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ ప్రదర్శన దారుణంగా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

బౌలింగ్‌లో కమిన్స్ ప్రదర్శన మందకొడిగా..

ఐపీఎల్ 2022లో మొదటి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫిప్టీ మినహాయించి ఇప్పటివరకు జట్టుకి సహకారం అందించింది తక్కువనే చెప్పాలి. బేస్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధర పలికిన పాట్ కమిన్స్ బౌలింగ్ ప్రస్తుతం మందకొడిగా సాగుతోంది. ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో మొత్తం 11.5 ఓవర్లు బౌల్ చేశాడు. కేవలం 3 వికెట్లు మాత్రమే సాధించాడు. ఈ ప్రదర్శన KKRకి మంచిది కాదు. కోల్‌కతా నైట్ రైడర్స్ తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా హైదరాబాద్‌కు 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాట్ కమిన్స్‌తో సహా కోల్‌కతా బౌలర్లు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో పాట్ కమిన్స్ 3.5 ఓవర్లలో 40 పరుగులిచ్చి 1 వికెట్ మాత్రమే తీశాడు.

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్‌ కమిన్స్‌ సంచలన ఇన్నిం‍గ్స్‌ ఆడాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లను ఊచకోత కోసిన కమిన్స్‌ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని ధాటికి కేకేఆర్‌ 162 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు ఓవర్లు ఉండగానే అందుకుంది. ఈ నేపథ్యంలోనే కమిన్స్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత తక్కువ బంతుల్లో అర్థసెంచరీ సాధించిన ఆటగాడిగా కమిన్స్‌.. కేఎల్‌ రాహుల్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. 14 బంతుల్లో కమిన్స్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకోగా.. కేఎల్‌ రాహుల్‌ 2018లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 14 బంతుల్లోనే ఫిప్టీ సాధించాడు.

Cold Water Side Effects: చల్లటి నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Peanuts Side Effects: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు వేరుశెనగ తింటున్నారా.. అయితే ప్రమాదమే..!

Taj Mahal: తాజ్‌మహల్‌ ప్రేమకి చిహ్నం.. దేశంలో చాలా కట్టడాలు ప్రేమతో ముడిపడి ఉన్నాయి..!