IPL Bio-Bubble: బయో బబుల్ బ్రేక్ చేస్తే భారీగా ఫైన్.. రిపీటైతే టోర్నీ నుంచే ఔట్.. షాకిస్తోన్న బీసీసీఐ కొత్త రూల్స్..

|

Mar 15, 2022 | 6:42 PM

IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. టోర్నమెంట్ సమయంలో బయో బబుల్‌ను బ్రేక్ చేసిన వారిపై బీసీసీఐ కఠినంగా వ్యవహరించనుంది.

IPL Bio-Bubble: బయో బబుల్ బ్రేక్ చేస్తే భారీగా ఫైన్.. రిపీటైతే టోర్నీ నుంచే ఔట్.. షాకిస్తోన్న బీసీసీఐ కొత్త రూల్స్..
Ipl 2022 New Rules
Follow us on

ఐపీఎల్ 2022 (IPL 2022) మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఈమేరకు ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి. టోర్నీకి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. దీని కోసం బీసీసీఐ ఈసారి చాలా కఠినమైన నిబంధనలను రూపొందించింది. ఈ నియమాలు బయో-బబుల్ (IPL 2022 Bio- Bubble) కి సంబంధించినవి కావడం గమనార్హం. మీడియా నివేదికల ప్రకారం, బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధంతోపాటు, జట్టు పాయింట్లను తగ్గించనుంది. వీటితోపాటు కోటి రూపాయల వరకు జరిమానా విధించే నిబంధనను తీసుకొచ్చింది. ఐపీఎల్ చివరి సీజన్‌లో, బయో బబుల్‌లో కరోనా కారణంగా ఆటగాళ్లను వాయిదా వేయవలసి వచ్చింది. ఆ తర్వాత టోర్నమెంట్ రెండవ భాగం యూఏఈలో నిర్వహించారు. ఈ మేరకు ఐపీఎల్‌ 2022 కోసం బీసీసీఐ(BCCI) చాలా కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది.

Cricbuzz నివేదిక ప్రకారం, బయో బబుల్‌లో ఎవరైనా ఆటగాడు లేదా అతని కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు.. ఆ జట్టు యజమాని లేదా వారితో ఉన్న వ్యక్తులు బయో బబుల్‌ను ఉల్లంఘించకూడదు. ఒకే ఈ నియమాలను ఉల్లంఘిస్తే.. ఆ భారాన్ని వారే భరించాల్సి ఉంటుంది. బయో బబుల్‌ను ఉల్లంఘించినందుకు, ఆటగాడిపై ఒక మ్యాచ్ నిషేధంతోపాటు మరో 7 రోజులు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుందని బీసీసీఐ ధృవీకరించింది. బయో బబుల్‌ను ఆటగాడి కుటుంబం లేదా మ్యాచ్ అధికారి ఉల్లంఘిస్తే, వారిపై మరింత తీవ్రమైన చర్యలు తీసుకోనున్నారు.

కోటి జరిమానా.. పాయింట్లలోనూ కోత..

ఐపీఎల్ 2022 సమయంలో ఒక జట్టు ఉద్దేశపూర్వకంగా బయటి వ్యక్తిని జట్టులోకి తీసుకరాకూడదు. ఇందుకు జరిమానగా ఒక కోటి రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది. అలాగే మళ్లీ అలాంటి పొరపాటు జరిగితే జట్టుకు ఒకటి లేదా రెండు పాయింట్లు కోత విధిస్తారు.

ప్లేయర్ బయో బబుల్‌ను బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది?

మొదటి సారి బయో బబుల్‌ను బ్రేక్ చేసిన ఆటగాడు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. అలాగే ఆ సమయంలో ఆడని మ్యాచ్‌లకు డబ్బు లభించదు. రెండవసారి ఇలానే చేస్తే.. ఆ ఆటగాడు ఏడు రోజుల క్వారంటైన్‌తో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మూడవసారి చేస్తే.. ఆ ఆటగాడు మొత్తం సీజన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే జట్టుకు ప్రత్యామ్నాయం కూడా ఇవ్వబోరని తెలుస్తోంది.

ఆటగాడి కుటుంబం బయో బబుల్‌ బ్రేక్ చేస్తే?

మొదటిసారి ఆటగాడి కుటుంబ సభ్యులు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. రెండవసారి బయోబబుల్ బ్రేక్ చేస్తే.. ఆ ప్లేయర్ కుటుంబం, స్నేహితుడు బయో బబుల్ నుంచి తొలగిస్తారు. అలాగే వారితో ఆన్న ఆటగాడు 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది.

బయో బబుల్‌లో బయటి వ్యక్తికి టీమ్ ఎంట్రీ ఇస్తే?

మొదటికసారి తప్పు చేస్తే ఆ జట్టు కోటి రూపాయలు జరిమానాగా చెల్లించాలి. రెండవ తప్పుకు, జట్టు పాయింట్ల నుంచి కోత విధించనున్నారు. మూడవ తప్పుకు, 2 పాయింట్లు తీసివేయనున్నారు.