IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. ఈమేరకు ఇప్పటికే అన్ని జట్లు తమ లిస్టును రూపొందించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మెగా వేలం(IPL 2022 Mega Auction)లో 500 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. అదే ఆటగాళ్లలో, రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) టీంమేట్ పేరు కూడా ఉంది . రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో మెగా వేలంలో పాల్గొనబోతున్నాడు. తన ఆల్ రౌండర్ గేమ్ ద్వారా ఆకట్టుకుంటున్న ఈ ఆటగాడు.. తన ప్రదర్శనకు ఈ బేస్ ధర కంటే ఎక్కువగా కనిపించింది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఫోర్డ్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడి పేరు ఆడమ్ మిల్నే. మొదట బ్యాట్‌తో, తర్వాత బంతితో తన సత్తా చాటి ఆకట్టుకున్నాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో తన జట్టుకు 200 పరుగుల భారీ విజయాన్ని అందించాడు.
ఆడమ్ మిల్నే ప్రధానంగా బౌలర్‌గానే కనిపిస్తాడు. కానీ, ఫోర్డ్ ట్రోఫీలో ఒటాగో వోల్ట్స్‌కి వ్యతిరేకంగా, అతను సెంట్రల్ స్టాగ్స్ కోసం బాల్, బ్యాటింగ్ రెండింటిలోనూ తనదైన ముద్ర వేశాడు. రోహిత్-విరాట్‌తో ఈ ఆటగాడి స్నేహం ఐపీఎల్ ద్వారానే ఏర్పడింది. రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌లోనూ, అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగంగా ఉన్నాడు.
18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
ప్రస్తుతం ఫోర్డ్ ట్రోఫీలో ఆడమ్ మిల్నే ఆటతీరు ఎంతగానో ఆకర్షించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ స్టాగ్స్ 37 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఈ జట్టును భారీ స్కోరుకు తీసుకెళ్లడంలో ఆడమ్ మిల్నే పాత్ర చాలా కీలకంగా మారింది. అతడితో పాటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లో వికెట్ కీపర్ విగ్గిన్స్ 80 పరుగులు చేశాడు. విల్ యంగ్ 40 పరుగులు చేయగా, రాస్ టేలర్ 45 పరుగులు చేయడంతో భారీ స్కోర్ నమోదైంది.
ఆడమ్ మిల్నే 21 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు. అయితే ఈ సమయంలో అతను కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే మిల్నే బ్యాట్‌తోనే కాదు.. బంతితోనూ విధ్వంసం సృష్టించాడు.
4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు..
భారీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒటాగో వోల్ట్స్ చతికిలపడింది. ఒటాగో వోల్ట్స్ బ్యాట్స్‌మెన్స్ పాలిట ఆడమ్ మిల్నే యముడిలా మారాడు. 4 ఓవర్లలో 15 పరుగులకే ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ చేర్చి భారీ దెబ్బ తీశాడు. దీంతో ఒటాగో వోల్ట్స్ ఈ మ్యాచ్‌లో 200 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒటాగో వోల్ట్స్‌కు చెందిన ఒక బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో, మిగిలిన 9 మంది బ్యాట్స్‌మెన్ కలిసి 114 పరుగులు మాత్రమే చేశారు.
#FordTrophy | @AdamMilne19 having a day in the @CentralStags big One Day win over the @OtagoVolts in Dunedin. 50 in 18 balls and then top order wickets. Scorecard + HIGHLIGHTS | https://t.co/TqpXXeRg8w pic.twitter.com/3mnpqLohvi
— BLACKCAPS (@BLACKCAPS) February 7, 2022
Also Read: IND vs WI: టీమిండియా దెబ్బకు మరింత దిగజారిన వెస్టిండీస్.. జట్టుతో చేరిన చెత్త రికార్డులేంటంటే?