LSG Vs KKR IPL 2022: చరిత్ర సృష్టించిన రాహుల్, డికాక్ జోడీ.. ఐపీఎల్‌లోనే తొలిసారి..

|

May 18, 2022 | 9:46 PM

ఈ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డి కాక్ 70 బంతుల్లో 140 పరుగులు చేసి కోల్‌కతా బౌలర్లను చిత్తు చిత్తుగా దంచేశాడు. ఈ సమయంలో క్వింటన్ డి కాక్ 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాదేశాడు.

LSG Vs KKR IPL 2022:  చరిత్ర సృష్టించిన రాహుల్, డికాక్ జోడీ.. ఐపీఎల్‌లోనే తొలిసారి..
Ipl 2022 Kl Rahul And Quinton De Kock
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో బుధవారం లక్నో టీం చరిత్ర సృష్టించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (LSG) ఓపెనర్లు ఇప్పటి వరకు జరగని ఓ రికార్డును సృష్టించారు. క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్ తుఫాను బ్యాటింగ్‌తో 20 ఓవర్లు మొత్తం క్రీజులో నిలిచి సత్తా చాటారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్ 210 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డి కాక్ 140 పరుగులు చేయగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ 68 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య 210 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఐపీఎల్‌లో చరిత్రలో వీరిద్దరు అద్భుత రికార్డును సృష్టించారు.

సిక్సర్ల వర్షం కురిపించిన లక్నో ఓపెనర్స్..

ఈ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డి కాక్ 70 బంతుల్లో 140 పరుగులు చేసి కోల్‌కతా బౌలర్లను చిత్తు చిత్తుగా దంచేశాడు. ఈ సమయంలో క్వింటన్ డి కాక్ 10 ఫోర్లు, 10 సిక్సర్లు బాదేశాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత, డి కాక్ ఏమాత్రం ఆగకుండా దాదాపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాడు.

ఇవి కూడా చదవండి

కెప్టెన్ కేఎల్ రాహుల్, డి కాక్‌కి అద్భుతమైన మద్దతునిస్తూ అతనికి స్ట్రైక్స్ ఇవ్వడం కొనసాగించాడు. అలాగే కేఎల్ రాహుల్ 68 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.

కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ మధ్య తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం..

కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ మధ్య భాగస్వామ్యం చారిత్రాత్మకమైనది. ఐపీఎల్ చరిత్రలో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. మరోవైపు, ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే, ఇది మూడవ అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది.

IPL చరిత్రలో భారీ భాగస్వామ్యాలు..

2016 కోహ్లీ- డివిలియర్స్ – 229 పరుగులు vs గుజరాత్

2015 కోహ్లీ- డివిలియర్స్ – 215* పరుగులు vs ముంబై

2022 రాహుల్-డి కాక్ – 210* vs కోల్‌కతా 2022

ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల గురించి మాట్లాడితే అందరూ పరుగులు కొల్లగొట్టారు. అత్యంత ఖరీదైన టిమ్ సౌథీ 4 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చాడు. క్వింటన్ డి కాక్ అతని ఓ ఓవర్లో 4 సిక్సర్లు బాదాడు. అతని తర్వాత ఆండ్రీ రస్సెల్ 3 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు.

ఇరు జట్లు..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), KL రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

Also Read: LSG vs KKR Score: కుమ్మేసిన లక్నో ఓపెనర్స్.. సెంచరీతో అదరగొట్టిన డికాక్.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్..

వారిద్దరికి విశ్రాంతి ఇవ్వడంలో అర్థం లేదు.. ఆడకుంటే ఫాంలోకి ఎలా వస్తారు? ఫైరవుతోన్న టీమిండియా మాజీ క్రికెటర్లు