క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కాబోతుంది. పాత జట్లతో పాటు ఈసారి రెండు కొత్త జట్లు ఈ టోర్నీలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ టైటాన్స్, ఓపెనర్ కే.ఎల్. రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. కాగా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ హార్ధిక్ తో పాటు శుభ్‌మన్ గిల్, రషీద్‌ఖాన్‌లను రిటైన్ చేసుకుంది. అలాగే వేలంలో ఏకంగా రూ. 52 కోట్లు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. లోకి ఫెర్గూసన్, రాహుల్ తెవాతియా, మహ్మద్ షమీ, యశ్ ధూల్, డేవిడ్ మిల్లర్, అభినవ్ సదరంగని, మాథ్యూ వేడ్, అల్జరీ జోసఫ్, జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా తదితర స్టార్ ఆటగాళ్లను ఎంచుకుంది.
కాగా ఐపీఎల్ పోరు కోసం సిద్ధమవుతోన్న టైటాన్స్ యాజమాన్యం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తన టీం అధికారిక లోగోను విడుదల చేసింది. మెటావర్స్ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్ చేసిన ఈ లోగోలో టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కనిపించారు. కాగా ముందుగా అహ్మదాబాద్ అని పేరుతో వచ్చి ఐపీఎల్ మెగా వేలానికి ముందు హఠాత్తుగా తన పేరును మార్చుకుంది గుజరాత్ జట్టు యాజమాన్యం. అప్పుడే విమర్శలు ఎదుర్కొన్న ఈ జట్టు ఇప్పుడు లోగో డిజైన్ విషయంలోనూ అలాగే వ్యవహరించారని అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ లోగోలో ఏమాత్రం కొత్తదనం లేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వేరే జట్ల లోగోలు, సోషల్ మీడియా అకౌంట్లను కాపీ చేసి లోగోను రూపొందించారని ఐపీఎల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
??♀️Step into the Titans Dugout! ▶️ Watch our stars unveil the logo in the metaverse! ⭐ ▶️ https://t.co/dCcIzWpM4U#GujaratTitans pic.twitter.com/9N6Cl6a3y4
— Gujarat Titans (@gujarat_titans) February 20, 2022
Also Read:B.S.Yediyurappa: మరోసారి ముఖ్యమంత్రిగా యడియూరప్ప!.. అసలు మ్యాటరేంటంటే..
Tirumala: శ్రీవారి భక్తులు బీ అలెర్ట్.. సర్వదర్శనం కోసం ఎన్ని గంటలు పడుతుందో తెలిస్తే షాక్..
Kajal Aggarwal: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాజల్.. అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసా..