GT vs SRH Live Score: సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి అదరగొట్టింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో (GT vs SRH) ఆ జట్టు 197 పరుగుల భారీ టార్గెట్‌ను ప్రత్యర్థి ముందు ఉంచింది. అభిషేక్ శర్మ (65), మర్‌క్రమ్ (56) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇక చివర్లలో ఆల్‌రౌండర్ శశాంక్ సింగ్ (6 బంతుల్లో 25 ఒక ఫోర్, 3 సిక్స్‌లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదటిసారిగా టాస్ ఓడిపోయాడు హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్. అందుకు తగ్గట్లే మూడో ఓవర్లోనే కేన్ రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. ఆతర్వాత వచ్చిన రాహుల్ (10) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే అభిషేక్ శర్మ, మర్‌క్రమ్ ఆచితూచి ఆడారు. నిలకడగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈక్రమంలోనే ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే 16 ఓవర్లో అభిషేక్ శర్మ ఔటైన తర్వాత సన్‌రైజర్స్ స్కోరు మందగించింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. పూరన్ (3), సుందర్ (3) త్వరత్వరగా ఔటవ్వడంతో 180 పరుగులు దాటడమే కష్టమనిపించింది. అయితే ఫెర్గూసన్ వేసిన చివరి ఓవర్‌లో శశాంక్ సింగ్ (6 బంతుల్లో 25 ఒక ఫోర్, 3 సిక్స్‌లు) రెచ్చిపోయాడు. అతనితో పాటు మార్కో జాన్సన్ మరొక సిక్స్ బాదడంతో ఆ జట్టు మొత్తం 25 పరుగులు పిండుకుంది. దీంతో గుజరాత్ ముందు 196 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
కాగా గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ (39/3), యశ్ దయాల్ (24/1) రాణించారు. ఫెర్గూసన్ (52/0), రషీద్ ఖాన్ (45/0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
Innings Break!
Incredible batting this by @SunRisers as they put up a total of 195/6 on the board.
Scorecard – https://t.co/TTOg8b6LG3 #GTvSRH #TATAIPL pic.twitter.com/ZeiUzzqQlA
— IndianPremierLeague (@IPL) April 27, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ప్రజలు బంగారం, వెండిని ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసా!..
Viral News: చికెన్ ముక్కలు తక్కువ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు.. ఆ తరువాత ట్విస్ట్ అదిరిపోయింది..!
Patnam Mahender Reddy: మరీ ఇంత దారుణంగానా..? పచ్చి బూతులు.. సీఐపై ఎమ్మెల్సీ వీరంగం..