IPL 2022: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తదుపరి మ్యాచ్‌కు జట్టులో చేరనున్న ఆ స్టార్‌ ఆటగాళ్లు!..

|

Apr 03, 2022 | 6:49 PM

Delhi Capitals in 2022: రిషభ్‌పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఐపీఎల్‌-2022 సీజన్‌లో పడుతూ లేస్తోంది. మొదటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి టోర్నలో శుభారంభం చేసింది.

IPL 2022: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. తదుపరి మ్యాచ్‌కు జట్టులో చేరనున్న ఆ స్టార్‌ ఆటగాళ్లు!..
Ipl 2022 Delhi Capitals
Follow us on

Delhi Capitals in 2022: రిషభ్‌పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఐపీఎల్‌-2022 సీజన్‌లో పడుతూ లేస్తోంది. మొదటి మ్యాచ్‌లో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి టోర్నలో శుభారంభం చేసింది. అయితే నిన్న గుజరాత్ టైటాన్స్‌ జరిగిన రెండో మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్‌లో గెలవడం.. 2 మ్యాచ్‌లు ఓడిపోవడం.. ఇలా గత సీజన్లలోనూ ఇదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తోంది రిషభ్‌ సేన. ఆ జట్టులో కీలక విదేశీ ఆటగాళ్లు లేకపోవడం కూడా ఈ ఓటములకు ఒక కారణం. కాగా ఈ సీజన్‌లో అన్రిచ్ నార్ట్జే , డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ వంటి టాప్‌క్లాస్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసింది ఢిల్లీ ఫ్రాంఛైజీ. అయితే ఆరంభమ్యాచ్‌లకు వారు అందుబాటులో లేకపోవడంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో స్థిరత్వం లోపించింది. మొదటి మ్యాచ్‌లో అది కనిపించకపోయినా రెండో మ్యాచ్‌లో విదేశీ ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా దూకుడైన బ్యాటర్లు లేకపోవడంతోనే గుజరాత్‌ మ్యాచ్‌లో ఆ జట్టు పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకోచ్‌ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) ఒక శుభవార్త చెప్పాడు. అన్రిచ్ నార్ట్జే, వార్నర్‌, మార్ష్‌ త్వరలోనే జట్టులో చేరనున్నట్లు తెలిపాడు.

మార్ష్ మరిన్ని రోజులు..

కాగా వెన్ను నొప్పి కారణంగా గతేడాది టీ 20 ప్రపంచకప్‌ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు నార్ట్జే. అయితే ఐపీఎల్‌ కల్లా అతను కోలుకుంటాడని భావించి అతనిని మళ్లీ రిటైన్‌ చేసుకుంది ఢిల్లీ యాజమాన్యం. కాగా అతని కమ్‌బ్యాక్‌పై స్పందించిన పాంటింగ్‌ ‘ నార్జే ప్రాక్టీస్‌లో పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే అతనికి మరింత ప్రాక్టీస్‌ అవసరం. మా తదుపరి మ్యాచ్‌కు (ఏప్రిల్ 7) ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. కాబట్టి అంతలోపు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని భావిస్తున్నాం. తదుపరి మ్యాచ్‌ తుది జట్టులో అందుబాటులో ఉంటాడు. ఇక వార్నర్ ఇప్పటికే ముంబై చేరుకున్నాడు. మిచెల్ మార్ష్ గత కొన్ని రోజులుగా ముంబైలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు. అతని క్వారంటైన్ ఆదివారంతో ముగియనుంది. ఏప్రిల్ 10న జరిగే మ్యాచ్‌కు (కేకేఆర్‌తో) (మార్ష్) అందుబాటులో ఉంటాడు’ అని చెప్పుకొచ్చాడు పాంటింగ్‌. దీంతో ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్‌తో జరిగే మ్యాచ్‌కు నార్జ్టే, వార్నర్‌ అందుబాటులో ఉండవచ్చు. అయితే గాయంతో బాధపడుతోన్న మార్ష్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని తెలుస్తోంది.

Also Read:CSK vs PBKS Live Score, IPL 2022: తొలి విజయం చెన్నై సొంతమయ్యేనా.. పంజాబ్‌తో అమీతుమీకి సిద్ధం.. మరికొద్దిసేపట్లో టాస్

Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!

Coffee: కాఫీతో ప్రయోజనాలు అనేకం.. చర్మం, జుట్టు సమస్యలు తొలగించడంలో సూపర్..!