IPL 2022: హ్యాట్రిక్‌పై కన్నేసిన కేఎల్ రాహుల్.. ఆ లిస్టులో వార్నర్‌ను వెనక్కు నెట్టనున్న లక్నో సారథి..

|

Mar 21, 2022 | 2:29 PM

KL Rahul: ఐపీఎల్ 2022( IPL 2022) ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఐపీఎల్‌ 15వ సీజన్ మరో 5 రోజుల్లో మొదలుకానుంది. ఈసారి 8 జట్లకు బదులుగా 10 జట్లు ఐపీఎల్ 2022లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

IPL 2022: హ్యాట్రిక్‌పై కన్నేసిన కేఎల్ రాహుల్.. ఆ లిస్టులో వార్నర్‌ను వెనక్కు నెట్టనున్న లక్నో సారథి..
Ipl 2022 Kl Rahul
Follow us on

ఐపీఎల్ 2022( IPL 2022) ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఐపీఎల్‌ 15వ సీజన్ మరో 5 రోజుల్లో మొదలుకానుంది. ఈసారి 8 జట్లకు బదులుగా 10 జట్లు ఐపీఎల్ 2022లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లందరి టీమ్‌లు మారినందున ఇది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. రెండు కొత్త జట్ల చేరికతో లీగ్ పరిధి మరింత విస్తరించింది. ఆటగాళ్లతో పాటు పలు జట్ల కెప్టెన్లు కూడా మారారు. బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ మినహా ప్రతి జట్టుకు కొత్త కెప్టెన్‌‌లు వచ్చారు. అయితే, హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ఈ ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతోంది మాత్రం కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) మాత్రమే. ఈ హ్యాట్రిక్‌(Hattrick) కి పరుగులతో సంబంధం ఉంది. ఈ లిస్టులో మూడోసారి కేఎల్ రాహుల్ టాప్‌లో నిలవనున్నాడు.

వరుసగా 2 సీజన్లలో 600+ స్కోర్లు..

డేవిడ్ వార్నర్ తర్వాత కేఎల్ రాహుల్ ఐపీఎల్ రెండవ కెప్టెన్‌గా మారనున్నాడు. అతను వరుసగా రెండు సీజన్లలో 600 ప్లస్ స్కోర్లు సాధించాడు. అంటే ప్రస్తుతం ఈ విషయంలో డేవిడ్ వార్నర్‌తో సమానంగా ఉన్నాడు. కానీ, ఐపీఎల్‌లో ప్రస్తుతం డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా చేయడం లేదు. ఇక లక్నోను తొలిసారి ఛాంపియన్‌గా మార్చే బాధ్యత కేఎల్‌ రాహుల్‌పై ఉంది. ఈ స్థితిలో హ్యాట్రిక్ సాధించడం ద్వారా వార్నర్‌ను వెనక్కునెట్టే అవకాశం ఉంది.

రాహుల్‌కి హ్యాట్రిక్ ఛాన్స్..

డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐపీఎల్ 2016, ఐపీఎల్ 2017లో బ్యాక్ టు బ్యాక్ 600 ప్లస్ స్కోర్లు నమోదుచేశాడు. అదే సమయంలో, కేఎల్ రాహుల్ IPL 2020, IPL 2021లో అద్భుతంగా చేశాడు. అంటే, ఐపీఎల్ 2022లో 600 ప్లస్ స్కోర్ చేసినా, అతడి హ్యాట్రిక్ పూర్తవుతుంది.

జెర్సీ రంగు మారింది..

ప్రస్తుతం రాహుల్ 15వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. లక్నోను మొదటిసారిగా ఛాంపియన్‌గా మార్చడానికి కేఎల్ రాహుల్ సిద్ధమవుతున్నాడు. అతను సోషల్ మీడియా ద్వారా తన ఉద్దేశాన్ని కూడా ఇప్పటికే వ్యక్తం చేశాడు. ఈమేరకు జెర్సీ రంగు కూడా మారిపోయింది.

Also Read: భారీ అంచనాలు.. అధిక ఒత్తిడి.. అయినా ఆకట్టుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్..

IPL 2022: ఢిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టుతో చేరిన తుఫాన్ బౌలర్..