IPL 2022 CSK vs MI Score: ముంబై ఇండియన్స్‌ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన చెన్నై.. తక్కువ స్కోర్‌కే ప్యాకప్‌..

|

May 12, 2022 | 9:21 PM

IPL 2022 CSK vs MI Score: ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతులేత్తేసింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్ల దాటికి కేవలం 97 పరుగులకే పరిమితమైంది...

IPL 2022 CSK vs MI Score: ముంబై ఇండియన్స్‌ బౌలర్ల దాటికి చేతులెత్తేసిన చెన్నై.. తక్కువ స్కోర్‌కే ప్యాకప్‌..
Follow us on

IPL 2022 CSK vs MI Score: ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతులేత్తేసింది. ముంబై ఇండియన్స్‌ బౌలర్ల దాటికి కేవలం 97 పరుగులకే పరిమితమైంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ వికెట్ల పతనం తొలి ఓవర్‌లోనే ప్రారంభమైంది. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లోకి జారుకుంది. చెన్నై జట్టులో డేవన్‌ కాన్వే, మొయిన్‌ అలీ, తీక్షణ సున్న పరుగులకే వెనుదిరిగారు.

ఇక రుతురాజ్‌ గైక్వాడ్ 7, రాబిన్‌ ఉతప్ప 1, అంబటి రాయుడు 10, శివమ్‌ దూబే 10, డ్వేన్‌ బ్రావో 12, ముకేశ్‌ చౌదరి 4 పరుగులకే పరిమితయ్యారు. ఇక చెన్నై బ్యాటర్లలో ధోనీ చేసిన (36*) పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ధోనీ తర్వాత ఎక్స్ట్రాల రూపంలో వచ్చిన 15 పరుగులే అత్యధికం కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇక ముంబై ఇండియన్స్‌ బౌలింగ్ విషయానికొస్తే.. డేనియల్‌ సామ్స్‌ 4 ఓవర్లకు గాను 16 మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మెరిడిత్‌, కుమార్‌ కార్తికేయ చేరో రెండు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, రమణ్‌దీప్‌ సింగ్ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. మరి చెన్నై ఇచ్చిన 98 పరుగుల లక్ష్యాన్ని ముంబై చేధిస్తుందా.? బౌలింగ్ విషయంలో చెన్నై ఏదైనా మ్యాజిక్‌ చేస్తుందో చూడాలి.