IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?

|

Jan 07, 2022 | 7:22 AM

BCCI: గతసారి లాగా, ఈసారి కూడా టీ20 లీగ్ కరోనా విలయంలో చిక్కుకోకుండా బీసీసీఐ 'ప్లాన్ బీ'ని సిద్ధం చేసింది. అదేంటంటే..

IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. ప్లాన్ బిని సిద్ధం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?
Bccci, Ipl 2022
Follow us on

IPL 2022: ఐపీఎల్ కొత్త సీజన్ కొత్త సాహసాలతో రాబోతోంది. కానీ, అదే సమయంలో, కరోనా కూడా తన సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది. గతేడాదిలానే ఈసారి కూడా టీ20 లీగ్ కరోనా విలయంలో చిక్కుకోకుండా బీసీసీఐ ‘ప్లాన్ బి’ని సిద్ధం చేస్తుంది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొన్ని నిర్దిష్ట చర్యలు తీసుకోవాలనే మూడ్‌లో ఉంది. లీగ్ నిర్వహణకు సంబంధించి తన కీలక నిర్ణయం ఏమిటో వెల్లడించింది. అయితే దానికంటే ముందు, ప్రస్తుత ప్లాన్ ఏమిటో తెలుసుకుందాం.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు ప్రస్తుతం రెండు ఎంపికలు ఉన్నాయి. ముందుగా- అన్ని మ్యాచ్‌లు 10 సెంటర్లలో జరగాలి. అంటే మొత్తం 10 జట్లకు హోమ్ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు జరగాలి. లేదంటే అన్ని మ్యాచులను ముంబైలోని వాంఖడే, సీసీఐ, డీవై పాటిల్ స్టేడియంలోని 3 సెంటర్లలో మాత్రమే నిర్వహించాలి. ప్రస్తుతం, ఈ ఈవెంట్ కోసం మళ్లీ యూఏఈకి వెళ్లాలని బీసీసీఐ ఆలోచించడం లేదు.

IPL 2022 కోసం BCCI ‘ప్లాన్ బి’ ఏంటంటే?
ప్రస్తుతం బీసీసీఐ ప్లాన్ బి ఏంటనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రశ్న. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, పెరుగుతున్న కరోనా ముప్పు దృష్ట్యా, భారత క్రికెట్ నియంత్రణ మండలి ముంబైలో మాత్రమే టోర్నమెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంటే అన్ని మ్యాచ్‌లు ముంబైలోనే జరగాలి. ఇది కాకుండా, కరోనా కారణంగా టోర్నమెంట్ తేదీని ఒక వారం ముందుగానే మార్చడంపై చర్చ జరుగుతోంది. అంటే ఏప్రిల్ 2కి బదులుగా, ఈ టోర్నమెంట్ ఇప్పుడు మార్చి 25 నుంచి నిర్వహించే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.

Also Read: IND vs SA: రెండో టెస్టులో టీమిండియా ఓటమి.. దక్షిణాఫ్రికాకు గెలిపించిన కెప్టెన్‌ ఎల్గర్‌.. సిరీస్‌ సమం..

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..