IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఆరోజు నుంచి స్టేడియాల్లో..

|

Apr 01, 2022 | 6:30 PM

గత శనివారం (మార్చి 26)న ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (IPL 2022) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. తద్వారా క్రికెట్‌ అభిమానులకు కావాల్సినంత మజా అందుతోంది.

IPL 2022: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఆరోజు నుంచి స్టేడియాల్లో..
Ipl 2022
Follow us on

గత శనివారం (మార్చి 26)న ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (IPL 2022) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. తద్వారా క్రికెట్‌ అభిమానులకు కావాల్సినంత మజా అందుతోంది. ఇప్పుడు ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా మరొక శుభవార్తను చెప్పింది బీసీసీఐ. ఏప్రిల్‌6 నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే అన్ని మైదానాల్లో 50 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈరోజు నుంచే మ్యాచ్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ వేదిక బుక్‌ మై షో (Bookmyshow) తెలిపింది. కాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో 25 శాతం ఆక్యుపెన్సీతో ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రేపటి (ఏప్రిల్‌) నుంచి అన్ని రకాల కరోనా నిబంధనలు ఎత్తివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 50 శాతం ఆక్యుపెన్సీతో మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

అందుబాటులో టికెట్లు..
కాగా ఐపీఎల్‌ సీజన్‌-15 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌ స్టేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం, పుణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. కాగా ఏప్రిల్‌ 6న జరిగే కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలుకానున్నాయి. పుణెలోని ఎంసీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ నుంచి ఏప్రిల్ 20న ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ వరకు టికెట్లను అందుబాటులో ఉంచినట్లు బుక్‌ మై షో తెలిపింది.

Also Read:Prakasam District: సమాధి తవ్వి చనిపోయిన బిడ్డకు పాలు పట్టిన తల్లి.. గుండెలు పిండేసే ఘటన

KKR vs PBKS: స్పెషల్ రికార్డ్‌కు చేరువలో గబ్బర్.. కేకేఆర్ మ్యాచ్‌లో అలా చేస్తే తొలి భారత ఆటగాడిగా గుర్తింపు?

Vijayawada Temple: రేపటి నుంచి వసంత నవరాత్రులు.. ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి