IPL 2022 Auction: ఆ 6గురి ప్లేయర్స్‌పై కన్నేసిన ఆర్‌సీబీ.. కోహ్లీ వారసుడి కోసం పెద్ద స్కెచే.!

ఐపీఎల్ 2022లో ఆర్సీబీకి సారధిగా ఎవరోస్తారన్న దానిపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు సన్‌రైజర్స్...

IPL 2022 Auction: ఆ 6గురి ప్లేయర్స్‌పై కన్నేసిన ఆర్‌సీబీ.. కోహ్లీ వారసుడి కోసం పెద్ద స్కెచే.!
Rcb

Updated on: Feb 08, 2022 | 8:49 AM

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ జరగనుంది. దీని కోసం ఇప్పటికే బీసీసీఐ సర్వం సిద్దం చేయగా.. ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకోవడంలో భాగంగా కీలక ప్లేయర్స్‌పై దృష్టి సారించారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎల్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో ఐపీఎల్ 2022లో ఆర్సీబీకి సారధిగా ఎవరోస్తారన్న దానిపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ఆర్సీబీ ఫ్రాంచైజీ సారధ్య బాధ్యతలను ఇవ్వనుందని టాక్ వినిపించగా.. లేటెస్ట్‌గా లిస్టులోకి శ్రేయాస్ అయ్యర్ వచ్చాడు. ఇక ఇప్పుడు మరో నలుగురు ఆటగాళ్లు కూడా ఈ లిస్టులో చేరారు.

డేవిడ్ వార్నర్, శ్రేయాస్ అయ్యర్, స్టీవ్ స్మిత్, ఇయాన్ మోర్గాన్, క్వింటన్ డికాక్, సురేష్ రైనా ఆర్సీబీ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు సమాచారం. వీరందరికీ కూడా కెప్టెన్‌గా అనుభవం ఉండటమే కాకుండా.. ఏ ఆర్డర్‌లోనైనా ఈ ప్లేయర్స్ విధ్వంసం సృస్టిస్తారు. మరి వీరిలో ఎవరిని కెప్టెన్ చేస్తారో అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం డేవిడ్ వార్నర్‌కే కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వడంలో ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ఇన్‌సైడ్ టాక్. మరి వీటిల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఆక్షన్ డే వరకు వేచి చూడాల్సిందే.!

Also Read:

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుందా.? ఈజీగా కనిపెట్టచ్చండోయ్.! కష్టం కాదు..

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టండి? ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరుతో పాట కూడా ఉందండోయ్!

Tamil Nadu: కాలువలో తేలియాడుతోన్న సూటుకేసు.. తెరిచి చూడగా పోలీసులకు షాక్..

Follow Us