IPL 2021: క్రికెట్ అభిమానులకు పండగే.. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సెకండ్ ఫేస్..! హింట్ ఇచ్చిన శుక్లా..

|

May 31, 2021 | 4:43 PM

IPL 2021 Phase 2 moved to UAE: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌ను

IPL 2021: క్రికెట్ అభిమానులకు పండగే.. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ సెకండ్ ఫేస్..! హింట్ ఇచ్చిన శుక్లా..
Ipl 2021
Follow us on

IPL 2021 Phase 2 moved to UAE: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌ను సెప్టెంబ‌ర్ 18 నుంచి నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా సోమవారం వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఈ ఐపీఎల్ టోర్నీని యూఏఈకి త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. దీనిపై అక్క‌డి బోర్డుతో చ‌ర్చించ‌డానికి శుక్లా దుబాయ్ వెళ్లారు. మ‌రో రెండు రోజుల్లో బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, సెక్ర‌ట‌రీ జే షా, ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేష్ ప‌టేల్ కూడా యూఏఈ రానున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా రాజీవ్ శుక్లా తెలిపారు. అక్క‌డి ప్ర‌ముఖ మిడియాతో రాజీవ్ శుక్లా మాట్టాడుతూ… తాము ఇక్క‌డి క్రికెట్ బోర్డుతో చర్చ‌లు జ‌ర‌ప‌నున్నామ‌ని, ఆ త‌ర్వాత షెడ్యూల్‌ను రూపొందిస్తామని వెల్లడించారు. గ‌తేడాది ఇక్క‌డ జ‌రిగిన‌ట్లే ఈసారి కూడా టోర్నీ స‌జావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తామ‌ని శుక్లా తెలిపారు.

కాగా.. మ్యాచ్‌లు వీక్షించేందుకు స్టేడియాల్లో అభిమానుల‌కు అనుమ‌తి ఇస్తారా లేదా అన్నది.. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చేతుల్లో ఉందని రాజీవ్ శుక్లా స్ప‌ష్టం చేశారు. అభిమానుల‌ను స్టేడియాల‌కు అనుమ‌తించినా, లేక‌పోయినా తమ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఈ సంద‌ర్భంగా శుక్లా పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ముగిసిన నాలుగు రోజుల త‌ర్వాత.. అంటే సెప్టెంబ‌ర్ 19న ఐపీఎల్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాల ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఐపీఎల్‌లో ఇప్ప‌టికే 29 మ్యాచ్‌లు ముగియ‌గా.. మ‌రో 31 మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉంది.

ఇదిలాఉంటే.. మిగిలిన మ్యాచ్‌లకు ప‌లువురు విదేశీ ఆట‌గాళ్లు దూరం కానున్నారు. ఈ అంశంపై కూడా తాము చ‌ర్చించిన‌ట్లు శుక్లా పేర్కొన్నారు. ఎవ‌రు వ‌చ్చినా రాక‌పోయినా ఈ టోర్నీని పూర్తి చేయ‌డంపైనే తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. దీనిని ఇలా మ‌ధ్య‌లో వ‌దిలి వేయ‌లేం. వ‌చ్చిన వాళ్ల‌తోనే టోర్నీ నిర్వ‌హిస్తామంటూ స్పష్టంచేశారు. టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్లందరికీ కోవిడ్ వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తామ‌ని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.

Also Read:

Model Rape: బాలీవుడ్‌లో కలకలం.. ప్రముఖ మోడల్‌పై అత్యాచారం.. 9 మంది సెలబ్రిటీలపై కేసు..

Juhi Chawla: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లక్కిన నటి జుహీ చావ్లా..