ఇప్పటికే ఐపీఎల్2021 నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకోవాలని చూస్తోంది. రాజస్తాన్‌కు బౌలింగ్ విభాగం బలంగా ఉంది. టోర్నీ నుంచి గౌరవంగా వైదొలగడానికి అన్ని విభాగాల్లోనూ సన్‌రైజర్స్ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం రెండు జట్లకు అవసరం. సన్‌రైజర్స్ వారి మిగిలిన ఆశలను సజీవంగా ఉంచడానికి ఈ రోజు గెలవడం చాలా అవసరం. కాబట్టి రాజస్తాన్ రాయల్స్ ఈ రోజు విజయంతో మొదటి నాలుగు జట్లలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తోంది. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవడానికి రాజస్తాన్ రాయల్స్, గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం తలపడనున్నాయి.
ఐపీఎల్ రెండో దశలో (IPL 14) ఢిల్లీ, పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిది ఓడిపోయి ఇప్పటికే టోర్నీ ఔటయింది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉన్న ఈ జట్టుపై గెలిచి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకోవాలని చూస్తోంది రాజస్తాన్ జట్టు. అయితే ఈ జట్టులోని కెప్టెన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు మిగిలిన బ్యాట్స్‌మెన్‌నుంచి సహకారం అందాల్సి ఉంది. బ్యాటింగ్ మెరుగుపడుతుందా.. 9 మ్యాచుల్లో 8 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది రాజస్తాన్.
ఎప్పుడు..: సన్‌రైజర్స్ vs రాజస్తాన్ రాయల్స్ , సెప్టెంబర్ 27,2021, రాత్రి 07:30 గంటలకు
ఎక్కడ: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
లైవ్ ఎక్కడ, ఎలా చూడాలి: ఐపీఎల్ మ్యాచులన్నీ డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో చూడొచ్చు. అలాగే స్టార్ స్పోర్ట్స్‌లోనూ ప్రత్యేక్ష ప్రసారం కానుంది.
రాజస్తాన్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఢిల్లీ జట్టు 33 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ బ్యాటింగ్ విఫలమైంది. కెప్టెన్ సామ్సన్ తప్ప.. ఏ బ్యాటర్ స్థిరపడలేకపోయాడు. అదే సమయంలో సన్‌రైజర్స్ మొదటి అర్ధభాగంలో ఆడిన 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కానీ ద్వితీయార్థంలో అది తన ఖాతా ఇంకా తెరవలేదు. ఆరెంజ్ ఆర్మీ రెండు ప్రారంభ మ్యాచ్‌లలో ఓడిపోయింది.
PM Modi: ప్రధాని మోడీ అలుపెరుగని అమెరికా పర్యటన.. 65 గంటలు.. 20 సమావేశాలు..