IPL 2021 RR vs CSK: మరో కీలక సమరం.. చెన్నై దూకుడుకు బ్రేక్‌ పడుతుందా.? రాజస్థాన్‌ గట్టెక్కుతుందా.? ఫలితం తెలియాలంటే..

|

Oct 02, 2021 | 7:57 AM

IPL 2021 RR vs CSK Live Streaming: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో ఫేస్‌లో 47వ మ్యాచ్‌గా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య నేడు (శనివారం) మ్యాచ్‌ జరగనుంది. ఓటమి అంటూ తెలియకుండా..

IPL 2021 RR vs CSK: మరో కీలక సమరం.. చెన్నై దూకుడుకు బ్రేక్‌ పడుతుందా.? రాజస్థాన్‌ గట్టెక్కుతుందా.? ఫలితం తెలియాలంటే..
Follow us on

IPL 2021 RR vs CSK Live Streaming: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో ఫేస్‌లో 47వ మ్యాచ్‌గా రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య నేడు (శనివారం) మ్యాచ్‌ జరగనుంది. ఓటమి అంటూ తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి దూసుకుపోతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి విజయాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతోంది.

రాజస్థాన్‌ ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు జరగబోయే మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు డూ అర్‌ డైగా మారిన ఈ మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో మ్యాచ్‌ ఎక్కడ, ఎప్పుడు జరగనుంది.? మ్యాచ్‌ను ఎలా వీక్షించాలిలాంటి పూర్తి వివరాలు మీకోసం..

మ్యాచ్‌ ఎప్పుడు ఎక్కడ జరగనుందంటే..

ఈ సీజన్‌లో జరుగుతోన్న 47వ మ్యాచ్‌ అయిన రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అక్టోబర్‌ 2 (శనివారం) సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ అబుదాబీలోని షేఖ్‌ జాయద్‌ స్టేడియంలో జరగనుంది.

మ్యాచ్‌ను ఎక్కడ వీక్షించవచ్చు..

ఈ మ్యాచ్ స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో మ్యాచ్‌ను చూడాలనుకునే వారు హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

జట్టు సభ్యుల వివరాలు..

రాజస్థాన్‌ రాయల్స్‌:

ఎవిస్‌ లూయిస్, యశ్వసి జైస్వాల్‌, సంజూ సామ్సన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్/డేవిడ్‌ మిల్లర్‌, మహిపాల్ లోమ్రోర్, రియాన్‌ పరాగ్‌/శివమ్‌ దూబే/శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్‌, క్రిస్‌ మోరిస్‌/ఓషేన్‌ థామస్‌, చేతన్‌ సకారియా, కార్తీక్‌ త్యాగి, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌.

చెన్నై సూపర్‌ కింగ్స్‌..

ధోనీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మోయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజిల్‌వుడ్/సామ్‌ కర్రాన్‌.

Also Read: బాలీవుడ్ నటి కంగనాకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చిన యూపీ సీఎం.. మురిసిపోతున్న రీల్ తలైవి

IPL 2021 Points Table: ఉత్కంఠగా కొనసాగుతోన్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఏయే జట్లు ఉన్నాయంటే..?

AP CM Jagan: నేడు సొంత ఊరుకు సీఎం జగన్ పయనం.. కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన