IPL 2021: సీపీఎల్‌‌లో 38 సిక్స్‌లు కొట్టిన రాజస్థాన్ ప్లేయర్.. ఫుల్ జోష్‌లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న విండీస్ ప్లేయర్

|

Sep 16, 2021 | 2:12 PM

ఈ బ్యాట్స్‌మెన్ రాకతో రాజస్థాన్ రాయల్స్ జోరు పెరుగుతుంది. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ గతంలో ముంబై ఇండియన్స్‌ను గర్వపడేలా చేశాడు.

IPL 2021: సీపీఎల్‌‌లో 38 సిక్స్‌లు కొట్టిన రాజస్థాన్ ప్లేయర్.. ఫుల్ జోష్‌లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న విండీస్ ప్లేయర్
Evin Lewis
Follow us on

IPL 2021: ఐపీఎల్ 2021 ద్వితీయార్ధానికి ముందు జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ లేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు డీలా పడింది. ఈ ఇద్దరు ఆంగ్ల ఆటగాళ్లు వేర్వేరు కారణాల వల్ల సెకాండాఫ్‌‌కి దూరమయ్యారు. ఇటువంటి పరిస్థితిలో, రాజస్థాన్ రాయల్స్ ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రత్యామ్నాయం కనుగొనాల్సి వచ్చింది. ఇందులో వెస్టిండీస్ ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయిస్ పేరు కూడా చేర్చబడింది. ఇప్పుడు ఈ బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాలనే నిర్ణయం రాయల్స్‌కు సరైనదని నిరూపించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఆటగాడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ తరఫున ఆడి సంచలన ఇన్నింగ్స్‌లను నెలకొల్పాడు. అలాగే అత్యధిక పరుగులు సాధించిన వారిలో ఒకడిగా నిలిచాడు. 11 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లలో రెండో స్థానంలో నిలిచాడు.

ఎవిన్ లూయిస్ సీపీఎల్‌ 2021 లో ఆయన సగటు 47.33 పరుగులుగా ఉంది. అలాగే 163.21 స్ట్రైక్ రేట్‌తో పరుగలు సాధించాడు. అతని పేరులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 102 నాటౌట్‌తో అత్యధిక స్కోర్ సాధించాడు. సెయింట్ లూసియా కింగ్స్ బ్యాట్స్‌మెన్ టోర్నమెంట్‌లో ఫోర్ల కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. అతని బ్యాట్ నుంచి 25 ఫోర్లు, 38 సిక్సర్లు రాలాయి. ఈ టోర్నమెంట్‌లో అతని తర్వాత, నికోలస్ పూరన్ సిక్సర్లు బాదడంలో రెండవ స్థానంలో ఉన్నాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 25 సిక్సర్లు కొట్టాడు. అంటే, ఎవిన్ లూయిస్ పూరన్ కంటే 13 సిక్సర్లు ఎక్కువగా కొట్టగా, ఇద్దరూ సమాన మ్యాచ్‌లు ఆడారు. సీపీఎల్ 2021 లో ఈ ఆటగాడు ఫోర్లు కొట్టడంలో రెండవ స్థానంలో ఉన్నాడు. అతను 25 బౌండరీలు కొట్టాడు. రోస్టన్ చేజ్ మాత్రమే 35 బౌండరీలు సాధించాడు.

ఇంతకు ముందు ఐపీఎల్‌లో..
ఐపీఎల్ 2018, 2019 లో లూయిస్ ముంబై ఇండియన్స్‌లో భాగంగా ఉన్నాడు. ఇక్కడ అతను 16 మ్యాచ్‌లు ఆడాడు. 131.1 స్ట్రైక్ రేట్‌తో 430 పరుగులు చేశాడు. అతను రెండుసార్లు ఐపీఎల్‌లో యాభై పరుగులు చేశాడు. ఎవిన్ లూయిస్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కూడా అతడిని అదే పాత్రలో ఆడించొచ్చు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో అతనికి మంచి రికార్డు ఉంది. అతను 45 మ్యాచ్‌ల్లో 31.38 సగటుతో 1518.03 స్ట్రైక్ రేట్‌తో 1318 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ల్లో అతను రెండు సెంచరీలు చేశాడు. దీనితో పాటు తొమ్మిది అర్థసెంచరీలు కూడా బాదేశాడు.

Also Read: First Hat-Trick in T20s: టీ20లో తొలి హ్యాట్రిక్ ఎప్పుడు నమోదైందో తెలుసా..? ఆ బౌలర్ ఎవరంటే? వీడియో

IPL 2021: రోహిత్ శర్మ ముందు ధోని-కోహ్లీ విఫలం.. ప్రస్తుతం తొలి స్థానంలో రిషబ్ పంత్ టీం..!