IPL 2021: మాయదారి కరోనా కారణంగా మరోసారి ప్రపంచ అత్యంత ధనిక లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విదేశాల్లో జరగనుంది. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతోంది. దానికి కారణం లేకపోలేదు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ 2021పై బీసీసీఐ పూర్తి ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చెన్నై వేదికగా మినీ ఆక్షన్ పూర్తి కాగా.. ఈ ఏడాది టోర్నమెంట్‌ను స్వదేశంలో జరిపేందుకు బీసీసీఐ సర్వం సిద్దం చేస్తోంది. అలాగే స్టేడియాలలోకి ఫ్యాన్స్‌ను సైతం అనుమతించాలని భావిస్తోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి లీగ్ మొదలుపెట్టాలని.. ముంబై, పూణే, అహ్మదాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు నిర్వహించాలని చూచాయిగా ఖరారు చేశారు.
అయితే తాజాగా మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత మరోసారి రోజురోజుకూ పెరుగుతుండటంతో ఐపీఎల్ ఇండియాలో జరుగుతుందని చెప్పలేమన్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కేంద్రం.. ఐపీఎల్‌కు అనుమతి ఇస్తుందో.? లేదో.? వేచి చూడాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్ అనంతరం ఐపీఎల్ వేదికలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా, మినీ వేలంలో ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్స్, ఆల్ రౌండర్లను తమ జట్లను బలపరుచుకోవడంలో భాగంగా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లకు.. మ్యాక్స్ వెల్ రూ.14.25 కోట్లకు, జెమిసన్ రూ.15 కోట్లకు అమ్ముడుపోయిన విషయం విదితమే. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికారు.
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!
Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్ చేసిన రియల్ హీరో.. చివరికి ఏమైందంటే.!
ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?