AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Final: తెలుగులో అదరగొట్టిన కోల్‌కతా ప్లేయర్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Dinesh Karthik: ఐపీఎల్‌ 2021 ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కీపర్‌ దినేశ్ కార్తీక్ అచ్చ తెలుగులో మాట్లాడాడు. తన మాటలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.

IPL 2021 Final: తెలుగులో అదరగొట్టిన కోల్‌కతా ప్లేయర్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Ipl 2021, Dinesh Karthik
Venkata Chari
|

Updated on: Oct 16, 2021 | 7:40 AM

Share

IPL 2021 Final: ఐపీఎల్‌ 2021 ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ కీపర్‌ దినేశ్ కార్తీక్ అచ్చ తెలుగులో మాట్లాడాడు. తన మాటలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్ కోసం తెలుగులో మాట్లాడిన దినేష్ కార్తీక్.. స్పష్టంగా మాట్లాడి ఆకట్టుకున్నాడు. ప్రముఖ వాఖ్యాత, తెలుగువాడైన హర్షా భోగ్లే కేకేఆర్ కీపర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఐపీఎల్ 2021 ఫైనల్‌‌లో ఏమైనా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నకు.. సాధారణ మ్యాచ్‌లానే ఫైనల్‌ను పరిగణిస్తున్నామని, ఒత్తిడి లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇలా పూర్తి ఇంటర్య్యూను తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్‌ను మెప్పించాడు. దీంతో దినేష్ కార్తీక్ అచ్చం తెలుగువాడిలా మాట్లాడి ఆకట్టుకున్నాడని నెట్టింట్లో కామెంట్లు చేస్తూ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ మేరకు హార్షా భోగ్లే కూడా సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

మ్యాచ్ విషయానికి వస్తే కీలకమైన ఫైనల్ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ తడబడింది. మొదటి నుంచి అద్భుతంగా ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 4వ సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. భారీ స్కోర్ ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్ టీం ఆరంభం అదిరినా.. తొలి వికెట్ అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులే చేయగలిగింది. ఐపీఎల్ 2021 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీం ముందు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించి, టీం భారీ స్కోర్ చేసేందుకు సహాయపడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ (32 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్), డుప్లెసిస్(86 పరుగులు, 59 బంతులు, 7 ఫోర్లు, 3 సిక్సులు), మొయిన్ అలీ(37 పరగులు, 20 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సులు) , రాబిన్ ఊతప్ప(31 పరుగులు, 15 బంతులు, 3 సిక్స్‌లు) రాణించడంతో చెన్నై భారీ స్కోర్ సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికట్లు, శివం మావీ ఒక వికెట్ సాధించాడు. మిగతా బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు.

Also Read: CSK vs KKR, IPL 2021 Final Result: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ధోనీ సేన.. ఫైనల్‌లో తడబడిన కోల్‌కతా..! (వీడియో)

IPL 2021 Final, CSK vs KKR: ఫైనల్లో చెలరేగిన చెన్నై బ్యాట్స్‌మెన్స్.. కోల్‌కతా ముందు 193 పరుగుల భారీ స్కోర్