ఎవర్రా సచిన్.! 140 సెంచరీలు, 36 వేలకుపైగా పరుగులు.. ఈ తోపు బ్యాటర్ బరిలోకి దిగితే బౌలర్లకు వణుకే.. ఎవరంటే.?

అతడు క్రీజులోకి వస్తే వణికిపోతారు. అతడు కొడితే ప్రతీ షాట్ బౌండరీ. బరిలోకి దిగితే సిక్సర్లు, ఫోర్ల మోత మోగాల్సిందే. మరి ఆ ప్లేయర్ ఎవరో తెల్సా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

ఎవర్రా సచిన్.! 140 సెంచరీలు, 36 వేలకుపైగా పరుగులు.. ఈ తోపు బ్యాటర్ బరిలోకి దిగితే బౌలర్లకు వణుకే.. ఎవరంటే.?
Cricket News

Updated on: Aug 05, 2025 | 9:04 AM

క్రీజులోకి దిగితే బౌలర్లు వణికిపోతారు. ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. సిక్సర్లు, ఫోర్ల మోత మోగాల్సిందే. సచిన్‌ను మించినోడు ఈ తోపు బ్యాటర్. మరి అతడు మరెవరో కాదు వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. 1974-91 కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ను ఓ ఊపు ఊపేశాడు ఈ క్రికెటర్. అనేక రికార్డులను బద్దలు కొట్టడమే కాదు.. క్రికెట్ గాడ్ సచిన్‌ను సైతం మించిపోయాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వివియన్ రిచర్డ్స్.. 18 ఏళ్ల వయస్సులో ఓ రెస్టారెంట్‌లో పని చేశాడు. ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని.. రిచర్డ్స్ మంచి క్రికెటర్ అవుతాడని ఓ క్రికెట్ కిట్ బహుమతిగా ఇచ్చాడు. ఆపై సెయింట్ జాన్స్ క్రికెట్ క్లబ్‌లో చేరిన రిచర్డ్స్.. డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలనాలు సృష్టించాడు. అనంతరం 3 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ నేషనల్ టీంలోకి అరంగేట్రం చేశాడు.

1974 సంవత్సరంలో వివియన్ రిచర్డ్స్ 3 మ్యాచ్‌లలో 261 పరుగులు చేయగా.. ఆ తర్వాతి సంవత్సరంలో 19 సగటుతో 210 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆపై ఏం జరిగిందో ఏంటో.? గ్రౌండ్‌లో రెచ్చిపోయాడు రిచర్డ్స్. 1976లో వివియన్ 7 సెంచరీలు కొట్టడమే కాదు.. 90 సగటుతో 1710 పరుగులు చేశాడు. మొత్తంగా 121 టెస్ట్ మ్యాచ్‌ల్లో 50కి పైగా సగటుతో 8540 పరుగులు చేశాడు వివియన్ రిచర్డ్స్. ఇందులో 24 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అటు వన్డేల్లో రిచర్డ్స్ 11 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలతో 6721 పరుగులు చేశాడు. ఇక వివియన్ రిచర్డ్స్ ఫస్ట్ క్లాస్ కెరీర్ విషయానికొస్తే.. మొత్తంగా 507 మ్యాచ్‌లలో 36,212 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి బ్యాట్ నుంచి 114 సెంచరీలు వచ్చాయి.

లిస్ట్-ఏలో వివియన్ రిచర్డ్స్ 26 సెంచరీలతో 16995 పరుగులు చేయగా.. మొత్తంగా తన క్రికెట్ కెరీర్‌లో 140 సెంచరీలు చేశాడు. ఇక విండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వివియన్ రిచర్డ్స్ 50 టెస్టు మ్యాచ్‌లలో జట్టుకు 27 విజయాలు ఇచ్చాడు. అటు కెప్టెన్‌గా కేవలం 8 టెస్టుల్లో మాత్రమే ఓడిపోయాడు.

ఇది చదవండి: 2 ఇన్నింగ్స్‌లలో 506 పరుగులు.. 52 ఫోర్లు, 24 సిక్సర్లతో ఉగ్రరూపం..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..