INDW vs ENGW 2022: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికింది. చరిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
INDW vs ENGW 2022: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికింది. చరిత్రాత్మక లార్డ్స్ మైదానం వేదికగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 16 పరుగులతో ఓడించిన టీమిండియా 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసింది. తద్వారా సీనియర్ పేసర్‌కు ఘనమైన వీడ్కోలు అందించినట్లయింది. కాగా మ్యాచ్‌కు ముందు జట్టు సభ్యులందరూ ఝులన్‌తో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకుని ఆమెకు జ్ఞాపికలు అందజేశారు. ప్రేక్షకులు కూడా చప్పట్లు కొడుతూ ఝులన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) భావోద్వేగానికి లోనైంది. ఝులన్‌ను ఆప్యాయంగా హత్తుకొని కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ మహిళా అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కాగా ఝులన్ కెప్టెన్సీలోనే హర్మన్ అరంగేట్రం చేయడం విశేషం.
కాగా టీమిండియా మహిళల క్రికెట్ జట్టుకు ఝులన్ అందించిన సేవలకు గుర్తింపుగా ఇరు జట్లు గార్డ్ ఆఫ్ హానర్‌తో ఆమెను సత్కరించాయి. అంతేకాదు కెప్టెన్ హర్మన్ టాస్‌కు తనతో పాటు గోస్వామిని కూడా తీసుకెళ్లింది. తద్వారా భారత అభిమానులతో పాటు క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకుంది హర్మన్. కాగా ఆఖరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి నిరాశపర్చింది ఝులన్. అయితే బౌలింగ్‌లో మాత్రం తన సత్తాను చాటింది. మొత్తం 10 ఓవర్ల కోటాను పూర్తి చేసిన ఆమె కేవలం 30 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లను నేలకూల్చింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి గ్రాండ్ ఫేర్‌వెల్ తీసుకున్నట్లయింది.
Smiles, tears & hugs! ? ? ?
An emotional huddle talk as @JhulanG10 set to play her final international game!